వామ్మో.. ఇలా కూడా తింటారా..?

ఏవైనా పదార్థాలను తినడానికి, తాగడానికి ఇళ్లల్లో మనం చాలా వస్తువులనే ఉపయోగిస్తూ ఉంటాం. తిన్నాక, తాగాక కడగాల్సి ఉంటుంది

By Medi Samrat  Published on  17 April 2024 5:15 PM IST
వామ్మో.. ఇలా కూడా తింటారా..?

ఏవైనా పదార్థాలను తినడానికి, తాగడానికి ఇళ్లల్లో మనం చాలా వస్తువులనే ఉపయోగిస్తూ ఉంటాం. తిన్నాక, తాగాక కడగాల్సి ఉంటుంది. అయితే ఓ వ్యక్తి ప్లేట్ల మీద ఓ ప్లాస్టిక్ పేపర్ ను ఉంచాడు.. ఇది సాధారణమే అని మీరు అనుకోవచ్చు. ఆఖరి తాగడానికి ఉపయోగించే మగ్గులో కూడా అతడు ప్లాస్టిక్ పేపర్ ను పెట్టడం చూసి నెటిజన్లు షాక్ అవుతూ ఉన్నారు. పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ వీడియోను షేర్ చేశారు. పాత్రలను ప్లాస్టిక్ ర్యాప్‌తో కప్పి.. ఆ పాత్రలను కడగకుండా చేయాలని ఆ వ్యక్తి ప్రయత్నించాడు.

ఆ ఫుటేజ్ ఓ వ్యక్తి అన్నం వడ్డించుకోవడంతో మొదలవుతుంది. ఇంతలో తాను కడగాల్సిన పాత్రలు గుర్తుకు వస్తాయి. వామ్మో అదొక పెద్ద పనిరా బాబూ అని అనుకుంటూ.. ప్లేట్ ను ఒక కవర్ లో పెట్టేస్తాడు. ఆ తర్వాత చెంచా దగ్గర నుండి అన్నింటినీ ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి.. తినేస్తాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వాటర్ ను సేవ్ చేయడానికి ఇది ఒక మార్గమని కొందరు అంటూ ఉండగా.. మరికొందరేమో ప్లాస్టిక్ ను ఇంతలా వాడడం కూడా చాలా తప్పు అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు.


Next Story