అట్లుంటది.. ఫ్రెండ్స్ తోటి..

Man tries to steal money from groom’s garland in viral video. ఒక వ్యక్తి వివాహ సమయంలో వరుడి దండ నుండి కొంత డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించాడు.

By Medi Samrat  Published on  10 April 2022 9:00 PM IST
అట్లుంటది.. ఫ్రెండ్స్ తోటి..

ఒక వ్యక్తి వివాహ సమయంలో వరుడి దండ నుండి కొంత డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటూ ఉన్నారు.

పెళ్లిలో భాగంగా వరుడికి డబ్బుతో కూడిన దండను ఇచ్చారు. అతడు అది ధరించి స్నేహితులు, బంధువులతో కలిసి కూర్చున్నాడు. ఆ సమయంలో వరుడి దగ్గర కూర్చున్న ఒక వ్యక్తి దండలోంచి కొన్ని కరెన్సీ నోట్లను లాక్కునేందుకు ప్రయత్నించాడు. వరుడు అతని వైపు తిరుగుతాడు. ఆ వ్యక్తి వెంటనే తన చేతిని తీసివేస్తాడు. కొద్ది క్షణాల తర్వాత ఆ వ్యక్తి విజయవంతంగా చేతినిండా నగదును తీసుకుంటాడు. స్నేహితులు కలిసే ఈ పని చేశారని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు.

పెళ్లి తేదీ లేదా ప్రదేశంకు సంబంధించిన వివ‌రాలు వీడియోలో వెల్లడించలేదు. పెళ్లికొడుకు పక్కనే కూర్చున్న అతని స్నేహితుడు ధరించిన దండలోంచి కొన్ని కరెన్సీ నోట్లను లాక్కునేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు.














Next Story