ముసలోడికి దసరా పండుగ అంటే ఇదేనా..! 28 మంది భార్యల ఎదుట 37వ పెళ్లి
Man Gets Married For The 37th Time In Front of His 28 Wives.భర్త పక్కచూపు చూస్తేనే ఒళ్లు హూనం చేసే భార్యల
By తోట వంశీ కుమార్ Published on 9 Jun 2021 2:25 PM ISTభర్త పక్కచూపు చూస్తేనే ఒళ్లు హూనం చేసే భార్యల గురించి మనం విన్నాం. భర్త మరో పెళ్లి చేసుకుంటానంటే ఆ భార్య ఏం చేస్తుందో అందరికి తెలిసిందే. అయితే.. ఈ పెళ్లి మాత్రం చాలా విచిత్రం. వయసు మీద పడి పళ్లూడిపోయిన తాతకి ఇప్పటికే 28 మంది భార్యలు ఉన్నారు. 35 మంది సంతానం. 126 మంది మనవల్లు, మనవరాళ్లు ఉన్నారు. కాటికి కాలు చాపుకున్నవేళ.. హాయిగా దేవున్ని తలుచుకుంటూ కాలం గడపక మనోడు 16ఏళ్ల అమ్మాయితో మరో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ విషయం తెలిసిన అతడి భార్యలు అతడిని అడ్డుకోవాల్సి పోయి దగ్గరుండి మరీ అతడికి పెళ్లి చేశారు. ఇది అతడికి 37వ పెళ్లి కావడం ఇక్కడ విశేషం. మరో 9 మంది భార్యలు ఇది వరకే చనిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
BRAVEST MAN..... LIVING
— Rupin Sharma IPS (@rupin1992) June 6, 2021
37th marriage in front of 28 wives, 135 children and 126 grandchildren.👇👇 pic.twitter.com/DGyx4wBkHY
ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్ లో 45 సెకండ్ల నిడివిగల ఈ వీడియోను పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు రూపిన్ శర్మ..'జీవించి ఉన్న అత్యంత సాహసి..28 మంది భార్యల ఎదుట 37వ వివాహం ' అనే క్యాప్షన్ ఇచ్చాడు. వీడియోను ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారనే వివరాలు తెలియరాలేదు. ఈ వీడియో చేసిన నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క పెళ్లి చేసుకోవడానికే అమ్మాయి దొరకక్క చస్తున్న ఈ పరిస్థితుల్లో తాత నువ్వు కేక అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. తాత ఖచ్చితంగా హాఫ్ సెంచరీ(50) పెళ్లిళ్లు చేసుకుంటాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ముసలోడికి దసరా పండుగ అంటే ఇదేనని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారీ ఈ వీడియోపై లుక్కేయండి