లేడీస్ టాయిలేట్ లోకి వెళ్లి డోర్ వేసుకున్న వ్య‌క్తి..

man Entered thew omen Toilet and locked the door in belagavi. కర్ణాటక రాష్ట్రం బెళగావిలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  29 May 2022 12:20 PM GMT
లేడీస్ టాయిలేట్ లోకి వెళ్లి డోర్ వేసుకున్న వ్య‌క్తి..

కర్ణాటక రాష్ట్రం బెళగావిలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కన్నడ సాహిత్య భవన్‌ ఆవరణలోని మహిళల టాయ్ లెట్ లోకి ఓ వ్యక్తి ప్రవేశించి తలుపులు వేసుకున్నాడు. ఈ ఘటన బెల్గాంలో చోటుచేసుకుంది. నగరంలోని చెన్నమ్మ సర్కిల్‌లోని సాహిత్య భవన్‌ ఆవరణలోకి ప్రవేశించిన వ్యక్తిని కిత్తూరు తాలూకా కొడన్‌పూర్‌కు చెందినవాడని చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఉదయం 7 గంటలకు ఆ వ్యక్తి సాహిత్య భవన్‌లోని మహిళల టాయిలెట్‌ లోపలికి వెళ్లి తాళం వేసుకున్నాడు. లోపల మహిళలు ఎవరైనా ఉన్నారేమోనని, లేదా అతడు ఏమి చేస్తాడోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తీసే పనిలో పడ్డారు. ఆ వ్యక్తి పిఎస్‌ఐ వచ్చే వరకు నేను తలుపు తీయనని పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ పీఎస్‌ఐ విఠోబా హావనవర్‌ అక్కడకు వచ్చి తలుపులు తెరిచేందుకు ఒప్పించారు. ఆ వ్యక్తి చేతిలో బకెట్ పట్టుకుని, గ్లాసులో మందుతో, టాయిలెట్ నుండి బయటకు వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసిన వారంతా ఒక్క క్షణం షాకయ్యారు. పోలీసులు ఆ వ్యక్తిని బెల్గాం మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.Next Story