క్రేజీ ఉద్యోగం.. క్యాండీ రుచి చూడండి.. రూ. 62 లక్షలు సంపాదించండి..!

Make $100K as this company's 'Chief Candy Officer. ఒక అమెరికన్ క్యాండీ కంపెనీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తూ ఉంది

By M.S.R  Published on  25 July 2022 1:52 PM IST
క్రేజీ ఉద్యోగం.. క్యాండీ రుచి చూడండి.. రూ. 62 లక్షలు సంపాదించండి..!

ఒక అమెరికన్ క్యాండీ కంపెనీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తూ ఉంది. ఆ ఉద్యోగం చేసే వారికి ఏకంగా $77,430 డాలర్లు సంవత్సరానికి గానూ ఇస్తారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 62 లక్షలు. ఇంతకూ ఆ ఉద్యోగం ఏమిటంటే.. చీఫ్ క్యాండీ ఆఫీసర్ (CCO). ఉత్తర అమెరికాలో అతిపెద్ద ఆన్‌లైన్ మిఠాయి రిటైలర్, 'క్యాండీ ఫన్‌హౌస్'.. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ ప్రత్యేక స్థానానికి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది. CCO ముఖ్యమైన డ్యూటీ ఏమిటంటే.. క్యాండీ రుచి చూడాల్సి ఉంటుంది.

ఉద్యోగ నియామకం ప్రకారం అతడు/ఆమె క్యాండీ బోర్డు సమావేశాలను కూడా నిర్వహించాలి. క్యాండీ పట్ల నిజమైన అభిరుచిని కలిగి ఉండాలి. కంపెనీ ఐదు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారిని ఎందుకు ఆ పదవికి అనుమతిస్తుందో వివరిస్తూ, కాండీ ఫన్‌హౌస్ యొక్క CEO, జమాల్ హెజాజీ మాట్లాడుతూ "క్యాండీ పై ప్రేమ వయస్సుతో సంబంధం కలిగి ఉండదు" అని చెప్పారు. ఆసక్తి ఉన్న ఎవరైనా ఆగస్టు 31లోపు కంపెనీ వెబ్‌సైట్‌లో దరఖాస్తును సమర్పించాలని కోరారు. అధికారిక కంపెనీ జాబ్ వెబ్‌సైట్ https://candyfunhouse.ca/pages/careers ను సంప్రదించండి. తమ పిల్లల తరపున తల్లిదండ్రులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. టొరంటో లేదా న్యూజెర్సీలోని నెవార్క్‌లోని క్యాండీ ఫన్‌హౌస్ ప్రధాన కార్యాలయంలో పని చేసే అవకాశం ఉంటుంది.












Next Story