కుర్ కురే దోశ.. పేరు విన్నారా.. టేస్ట్ చూస్తారా..?

Kurkure dosa from a Delhi eatery may take you by surprise. దోసెలు చాలా మందికి ఇష్టమైనవి. ప్రతి రోజూ దోసెలే తినమన్నా హ్యాపీగా తినేవారు ఉంటారు.

By Medi Samrat  Published on  18 Feb 2022 8:19 AM GMT
కుర్ కురే దోశ.. పేరు విన్నారా.. టేస్ట్ చూస్తారా..?

దోసెలు చాలా మందికి ఇష్టమైనవి. ప్రతి రోజూ దోసెలే తినమన్నా హ్యాపీగా తినేవారు ఉంటారు. దోస లో ఎన్నో రకాల వెరైటీలు చేస్తూ ఉంటారు. 50 రకాల దోసె పాయింట్.. వెరైటీ పదార్థాలతో దోసెలు వేసే వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. ఇక సోషల్ మీడియాలో వెరైటీ దోసెలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు మసాలా దోస, ఐస్‌క్రీమ్ దోస, పింక్ దోస, ఆల్ కలర్ దోస.. ఇండో-చైనీస్ దోసకు సంబంధించిన వీడియోలు చూడవచ్చు. న్యూఢిల్లీలోని ఒక దోస పాయింట్ లో కుర్కురే దోసెను తయారు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది.

ఆ వంటను తయారుచేసే వ్యక్తి ఒక గిన్నె నిండా దోసె పిండిని తీసుకుని తవా మీద వేస్తూ ఉండగా వీడియో మొదలవుతుంది. అతను తరిగిన ఉల్లిపాయలు, కొన్ని ఆకుకూరలు తీసుకుని కొద్దిసేపు ఈ దోసపై ఉంచాడు. ఆ తర్వాత అతను కొన్ని పదార్థాలను జోడించి, కుర్కురే ట్విస్ట్ పదార్థానికి తగిలేలా ఉంచాడు. ఫుడ్ బ్లాగర్ 'ది గ్రేట్ ఇండియన్ ఫుడీ' ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో యొక్క శీర్షిక ప్రకారం.. ఈ వీడియోను షూట్ చేసిన ప్రదేశం న్యూఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లోని దోసా విల్లాస్.

కుర్కురేని జోడించిన తర్వాత, అతను దోసెపై కొంచెం తురిమిన చీజ్‌ను కూడా జోడించాడు. కుర్కురే ముక్కలు అలాగే ఉండేలా దోసెను మడతపెట్టకుండా వడ్డిస్తారు. ఈ వింత దోసెపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Next Story
Share it