నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట
Karnataka Lovers Roamance On Bike Riding In Main Road. ప్రేమ జంట నడిరోడ్డుపై రెచ్చిపోయింది. బైక్‌పై రైడ్ చేస్తుండగా ఒకరినొకరు
By Medi Samrat Published on
23 April 2022 12:00 PM GMT

ప్రేమ జంట నడిరోడ్డుపై రెచ్చిపోయింది. బైక్‌పై రైడ్ చేస్తుండగా ఒకరినొకరు హత్తుకుని రోడ్డుపై హంగామా చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరూ తాము రోడ్డుపై ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి.. ఎదురుగా వచ్చే వాహనాలను పట్టించుకోకుండా రోడ్డుపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లారు. పల్సర్ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ప్రియురాలిని కూర్చోపెట్టుకుని ప్రియుడు రెచ్చిపోయాడు. వారి వెనకాలే వస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంటకర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట మున్సిపాలిటీ పరిసర ప్రాంతంలో ఓ ఇద్దరు ప్రేమికులు రోడ్డుపైనే ఆదమరిచి ప్రవర్తించారు. ప్రియుడు బైక్ నడుపుతుండగా.. ప్రేయసి పెట్రోల్ ట్యాంక్‌పై అతడికి ఎదురుగా కూర్చుని ముద్దుల వర్షం కురిపించింది. ఎదురుగా భారీ వాహనం వస్తున్నా అదేమీ పట్టించుకోలేదు.
Next Story