ప‌చ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్‌.. ఇది చాలా టెస్టీ గురూ.. వీడియో వైరల్‌.!

Indore man makes ice cream with mirchi and Nutella in viral video. ఇండోర్‌కు చెందిన ఈ వెండర్ తన రోడ్‌సైడ్ స్టాల్‌లో మిరపకాయలు, కొన్ని ఇతర పదార్థాలతో ఐస్‌క్రీమ్‌ను తయారు చేశాడు.

By అంజి  Published on  7 Dec 2021 11:10 AM IST
ప‌చ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్‌.. ఇది చాలా టెస్టీ గురూ.. వీడియో వైరల్‌.!

ఇటీవల ఎన్నో రకాల వింతైన వంటకాలు సోషల్‌ మీడియాలో తెగవైరల్‌ అవుతున్నాయి. ఇంటర్నెట్‌లో వింతైన ఆహార వీడియోలకు కొరత కూడా లేదు. ఇలాంటి వింత వంటకాలు చూసి కొందరు నెటిజన్లు భయపడితే.. కొందరు మాత్రం వాటిని టేస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఝన్నత్‌ మిర్చి ఐస్‌ క్రీమ్‌ రోల్‌ అనే వంటకాన్ని చూసి నెటిజన్లు అసహ్యించుకుంటున్నారు. ఇండోర్‌కు చెందిన ఈ వెండర్ తన రోడ్‌సైడ్ స్టాల్‌లో మిరపకాయలు, కొన్ని ఇతర పదార్థాలతో ఐస్‌క్రీమ్‌ను తయారు చేశాడు. ఇక కొందరు దీన్ని చూసి వావ్‌ అంటుంటే.. మరికొందరు లొట్టలేసుకుంటూ లాగించెస్తున్నారు. ఆ వెండర్‌ మొదటగా మిరపకాయలను చదునైన ఉపరితలంపై చిన్న ముక్కలుగా కోసాడు. ఆ తర్వాత, మిల్క్ క్రీం కాకుండా మిరపకాయలకు నుటెల్లా - చాక్లెట్ స్ప్రెడ్ - జోడించాడు. తరువాత, అతను ఐస్ క్రీం సిద్ధం చేయడానికి పదార్థాలను బాగా కలిపాడు.

తరువాత గడ్డకట్టిన ఆ మిశ్రమాన్ని రోల్స్‌గా కట్ చేసి, ఐస్ క్రీం రోల్స్‌ను మిరపకాయలతో అలంకరించాడు. ఇలా ప‌చ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్‌ తయారు చేసి జనాలకు కొత్త రుచిని చూపిస్తున్నాడు. స్పాన్స్ ఆఫ్ ఇండోర్ 2.0, యూట్యూబ్ ఛానెల్, మిర్చి ఐస్‌క్రీమ్ రోల్‌ను తయారు చేస్తున్న స్ట్రీట్ ఫుడ్ వెండర్‌ సంబంధించిన చిన్న క్లిప్‌ను పోస్ట్ చేసింది. ఇది ఆన్‌లైన్‌లో 76 లక్షల వ్యూస్‌తో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో క్రేజీగా వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్‌.. కొన్ని వెల్లుల్లి, అల్లం కూడా వేయండి అంటూ ఫన్నీ కామంట్‌ చేయగా, మరో నెటిజన్‌.. మాకు ఫుడ్‌ అబ్యూజ్‌ కంట్రోల్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా చాలా అవసరమని చెప్పాడు.


Next Story