ఇంజనీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలను వదిలిపెట్టి బిర్యానీలను అమ్మడం మొదలుపెట్టగా..!

Haryana Engineer Duo Quits 9-5 Job To Sell Biryani. హర్యానా ఇంజనీర్ విద్యార్థులు రోహిత్ సైనీ, విశాల్ భరద్వాజ్ సోనేపట్‌లో ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు.

By Medi Samrat  Published on  14 March 2022 12:13 PM GMT
ఇంజనీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలను వదిలిపెట్టి బిర్యానీలను అమ్మడం మొదలుపెట్టగా..!

హర్యానా ఇంజనీర్ విద్యార్థులు రోహిత్ సైనీ, విశాల్ భరద్వాజ్ సోనేపట్‌లో ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు. రోహిత్‌కు సాధారణంగా వంట, ఆహారం పట్ల మంచి అభిరుచి ఉంది. ప్రతిరోజూ ఉద్యోగంలో 9 నుండి 5 వరకు పని చేయాలనేది వారికి అసలు నచ్చక.. చివరకు వారు రుచికరమైన బిర్యానీని అందించే ఫుడ్ స్టాల్‌ను ప్రారంభించేందుకు తమ ఉద్యోగాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. "ఇంజినీర్స్ వెజ్ బిర్యానీ" అని ఉత్తర ఢిల్లీలోని మోడల్ టౌన్‌లో దుకాణాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులకు ఇష్టమైన వంటను అందించడమే కాకుండా, వారు హోమ్ డెలివరీ కూడా చేస్తారు. వారి కథ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది, సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా షేర్ చేయబడింది.

వీరు అందించే రుచికరమైన బిర్యానీ పూర్తిగా ఆయిల్ ఫ్రీ, శాఖాహారం కూడా..! రోహిత్ సైనీకి ఎప్పుడూ వంట, ఆహారం పట్ల మక్కువ కలిగి ఉండేవాడు. అతను చాలా సంవత్సరాల క్రితం యూట్యూబ్‌లో తన స్వంత వంట ఛానెల్‌ని ప్రారంభించాడు. "నాకు 'కుకింగ్ విత్ రోహిత్' అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. నాకు సమయం దొరికినప్పుడల్లా, నేను దానిలో వంటకాలకు సంబంధించిన వీడియోలను ఉంచుతాను," అని సైనీ చెప్పారు. సైనీ ఆఫీసు రోజుల్లో విశాల్ భరద్వాజ్‌ ని కలుసుకున్నప్పుడు బిజినెస్ చేయాలని అనుకున్నారు. "నా ఆఫీసు సహోద్యోగి విశాల్ భరద్వాజ్ తరచుగా స్వంతంగా ఏదైనా ప్రారంభించాలని చెబుతుండేవాడు. ఇద్దరం కలిసి వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము" అని అతను చెప్పాడు. రోహిత్ ప్రతిరోజూ బిర్యానీని స్వయంగా వండుతుండగా, విశాల్ వ్యాపార విభాగాన్ని చూకుంటూ ఉన్నాడు.

"మేము బిర్యానీని ఎంచుకోవడానికి కారణం ఇది చాలా ఎక్కువ ధరలకు సోనేపట్ రెస్టారెంట్లలో మాత్రమే లభిస్తుంది. అందువల్ల, రెస్టారెంట్ తరహా బిర్యానీని తక్కువ ధరలకు అందించడమే మా లక్ష్యం." అని చెప్పారు. ఇంజనీర్ వెజ్ బిర్యానీ వారి స్టాల్‌లో రెండు రకాల బిర్యానీలను అందిస్తున్నారు. అచారి బిర్యానీ, గ్రేవీ చాప్ బిర్యానీ. "ఈ మధ్య కాలంలో చాప్ ట్రెండ్‌ని చూశాం. బిర్యానీలో సలాన్‌కి బదులుగా గ్రేవీని ఉపయోగిస్తున్నాం" అని రోహిత్ వెల్లడించాడు. అచారి బిర్యానీ ధర హాఫ్ ప్లేట్‌కు 30రూపాయలు కాగా, ఫుల్ ప్లేట్ 50 రూపాయలు, గ్రేవీ చాప్ బిర్యానీ ధర రూ. 70. రూపాయలు. బిర్యానీల తయారీకి సంబంధించిన వీడియోలను రోహిత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా పంచుకున్నాడు.

Next Story