రెండున్నర కోట్ల ధర ఉన్న ట్రక్కును భారత్ లోకి తీసుకువచ్చాడు.. డ్రైవర్ కు నెల జీతం ఎంతంటే..

Gujarat Man Owns Kenworth Truck Worth Rs 2.5 Crore. మీరు ట్రాన్స్‌ఫార్మర్స్, టెర్మినేటర్ వంటి హాలీవుడ్ సినిమాలను చూస్తే కొన్ని భారీ ట్రక్కులను గమనించే ఉంటారు.

By Medi Samrat  Published on  27 Feb 2022 9:54 AM GMT
రెండున్నర కోట్ల ధర ఉన్న ట్రక్కును భారత్ లోకి తీసుకువచ్చాడు.. డ్రైవర్ కు నెల జీతం ఎంతంటే..

మీరు ట్రాన్స్‌ఫార్మర్స్, టెర్మినేటర్ వంటి హాలీవుడ్ సినిమాలను చూస్తే కొన్ని భారీ ట్రక్కులను గమనించే ఉంటారు. అలాంటివి మన దేశంలో ఎక్కడా కనిపించవు. అమెరికా రోడ్లపై ఎక్కువగా తిరిగే ఈ భారీ ట్రక్కులలో మన భారతీయ ట్రక్కుల్లో ఎక్కడా కనిపించని ఫీచర్లతో నిండి ఉన్నాయి. ఈ భారీ వాహనాలు అనేక కారణాల వల్ల భారతీయ రహదారులపై చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. CarBlogIndia నివేదించిన ప్రకారం, గుజరాత్‌లోని ఒక వ్యక్తి భారతదేశంలో 'కెన్‌వర్త్ కంపెనీ ట్రక్కు' ను కలిగి ఉన్న వాడిగా నిలిచాడు. కెన్‌వర్త్ ఒక అమెరికన్ ట్రక్ కంపెనీ, ఇది హెవీ డ్యూటీ, మీడియం-డ్యూటీ వాణిజ్య వాహనాలను తయారు చేయడంలో ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది.

ట్రాన్స్‌పోర్ట్ టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ వీడియోలో వాహనం యజమానితో మాట్లాడడం మనం చూడొచ్చు. ట్రక్కు అమెరికా నుంచి దిగుమతి అయిందని, వాహనాన్ని నడిపేందుకు డ్రైవర్‌ను కూడా అక్కడి నుంచి తీసుకొచ్చినట్లు ఓనర్ వీడియోలో వెల్లడించాడు. ట్రక్కు డ్రైవర్ నెలకు రూ. 1 లక్ష జీతం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఆ ట్రక్కు విలువ రూ. 2.5 కోట్లు అని డ్రైవర్ వెల్లడించాడు. దిగుమతి చేసుకున్న వాహనం కావడంతో రూ. 30 లక్షల దిగుమతి సుంకం, రోడ్డు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. యజమాని అలాంటి ట్రక్కుల పట్ల తనకున్న అభిరుచిని తెలిపాడు. తన దగ్గర ఇతర వాణిజ్య ట్రక్కులు కూడా ఉన్నాయని యజమాని ఇంటర్వ్యూలో చెప్పాడు. వీడియోను మీరు కూడా చూసేయండి.. అందులో ఉన్న ఫీచర్లను కూడా తెలుసుకోండి.


Next Story