ఆస్తుల పేపర్లు ఇచ్చి నిమ్మకాయలు తీసుకుని వెళ్ళండి
Give ornaments and property papers, take lemons in return. ఈ రోజుల్లో నిమ్మకాయల ధరలు ఎంత అధిక ధరకు అమ్ముతున్నారో అందరికీ తెలుసు
By M.S.R Published on 26 April 2022 7:14 PM ISTఈ రోజుల్లో నిమ్మకాయల ధరలు ఎంత అధిక ధరకు అమ్ముతున్నారో అందరికీ తెలుసు.. కానీ చండీగఢ్‌లో నిమ్మకాయలు కొనడానికి ప్రజలు తమ ఆభరణాలను తాకట్టు పెట్టాలట. ప్రజలు తమ ఆస్తి పత్రాలకు బదులుగా నిమ్మకాయ, పెట్రోల్‌ను కూడా కొనుగోలు చేస్తున్నారు. మీకు ఒకింత షాకింగ్ గా అనిపించినా.. ఇదంతా నిజమే, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమం ఇది.
హాస్యనటుడు జస్పాల్ భట్టికి చెందిన నాన్ సెన్స్ క్లబ్ ఇలా ప్రదర్శన నిర్వహించింది. ఇందులో మీ దగ్గర ఉన్న వస్తువులకు బదులుగా నిమ్మకాయలు ఇచ్చారు. పెరుగుతున్న నిమ్మకాయల ధరల దృష్ట్యా, జస్పాల్ భట్టి యొక్క నాన్ సెన్స్ క్లబ్ చండీగఢ్‌లో నిమ్మకాయ మార్పిడి పథకాన్ని ప్రారంభించింది. ప్రజలు తమ ఆభరణాలు, ఆస్తి పత్రాలకు బదులుగా నిమ్మకాయలను తీసుకోవచ్చు. చండీగఢ్‌లోని సెక్టార్ 17లో, డప్పులు, సంగీతంతో ఈ పథకం గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ వింత పథకం కేవలం వ్యంగ్యంగా మాత్రమే..! దేశంలోని పలు ప్రాంతాల్లో నిమ్మకాయల ధరలు ఆల్ టైమ్ హై కు చేరుకున్నాయి.
మార్చి చివరి వారంలో నిమ్మకాయల ధర కిలో రూ.120కి చేరింది. ఏప్రిల్ మొదటి వారం నాటికి కిలో రూ.240కి ఎగబాకింది. ధరల పెరుగుదల కొనసాగుతూనే వచ్చింది. ఏప్రిల్ 10 నాటికి, నిమ్మకాయలు కిలో రూ. 320కి విక్రయించబడ్డాయి. ఏప్రిల్ 25 నాటికి కిలో రూ.280కి పడిపోయింది. వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరా కొరత కారణంగా నిమ్మకాయల ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డజన్ల కింద ఇస్తున్నారు.. ఇంకొన్ని చోట్ల ఒక్కో నిమ్మకాయ 15 రూపాయలకు పైగానే పలికిందని నెటిజన్లు చెబుతూ వస్తున్నారు.