సాధారణంగా మనం చేతులతో నీటితో ఉన్న గ్లాసులను.. ఒకేసారి రెండూ గ్లాస్‌లను, ఇంకా ప్రయత్నిస్తే నాలుగు గ్లాసులను పట్టుకుంటాం. ఇంకా ఎక్కువ పట్టుకోవాలని ప్రయత్నించినా అవి జారి కింద పడిపోతాయి. ఇక గాజు గ్లాస్‌లు అయితే తీసుకెళ్లడం కూడా అసాధ్యం. మరేదైనా ప్రయత్నం చేసి పెద్ద మొత్తంలో గ్లాసులను తీసుకువెళ్లాలంటే ట్రై ఉపయోగిస్తాం. కానీ నెదర్లాండ్స్‌కి చెందిన క్రిస్టియాన్ రోట్‌గెరింగ్ మాత్రం.. ఏకంగా 48 బీర్ గ్లాస్‌లను ఐదు ట్రైల్లో పెట్టి తన కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌కు తీసుకు వెళ్లాడు. క్రిస్టియాన్ రోట్‌గెరింగ్‌కు ఫుట్‌బాల్ గేమ్‌కు పెద్ద అభిమాని.
ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు తన ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి స్టేడియానికి వచ్చాడు. కాసేపటి తర్వాత వారి కోసం బీర్‌ను కొనుగోలు చేశాడు. ఓకేసారి ఐదు ట్రైల్లో బీర్ గ్లాసులను ఒకదానిపై ఒకటిపెట్టి 48 బీర్ గ్లాస్‌లను పేర్చాడు. 48 గ్లాస్‌లను ఒకేసారి స్టేడియం లోపల ఉన్న తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకువెళ్తుండగా అక్కడున్న ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నిగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో క్రిస్టియాన్ రోట్‌గెరింగ్ పెద్ద సెలబ్రిటీ అయ్యాడు.