పెళ్లిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయింపబడతాయి అంటారు. భువిలో మాత్రం తమ ఇష్టానుసారం సాంప్రదాయం ప్రకారం జరుపుకుంటారు. ఈ మద్య కాలంలో కొంత మంది వివాహాలు మాత్రం చాలా చిత్ర విచిత్రంగా జరుపుకుంటున్నారు. కొంత మంది ఆకాశ వీధిలో చేసుకుంటే మరికొంత మంది ఎత్తైన కొండ ప్రాంతాల్లో జరుపుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో ఓ జంట కడలి గర్భంలో కల్యాణం చేసుకుని మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది.

తమిళనాడులోని చిన్నదురై, కోయంబత్తూరు జిల్లాకు చెందిన శ్వేతకు నిశ్చితార్థం జరుపుకున్న తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం పెళ్లికుమార్తె శ్వేతతో కలిసి చెన్నై సమీపం నీలాంగరై సముద్రంలో ఒక పడవలో అలలపై ప్రయాణిస్తూ 60 అడుగుల దూరానికి చేరుకున్నాడు. ఆక్సిజన్‌ సిలిండర్‌ అమర్చిన స్కూబా డైవింగ్‌ డ్రస్సును ఇద్దరు వేసుకుని సముద్ర గర్భంలోకి వెళ్లి పూలతో అలంకరించి ఉన్న వివాహవేదిక వద్దకు చేరుకున్నారు.

అలల్లో తేలియాడుతూనే ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఆ తరువాత పెళ్లికుమారుడు చిన్నదురై పెళ్లికుమార్తె శ్వేత మెడలో తాళి కట్టాడు. పెళ్లైన తర్వాత వధూవరులు తీరానికి రాగానే అందరూ శుభాకాంక్షలు తెలిపారు. అయితే పెళ్ల సమయంలో జరిగే వృధా ఖర్చు.. వ్యర్థాల వల్ల కాలుష్యం తమకు ఇష్టం లేకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వధూవరులు తెలిపారు.
సామ్రాట్

Next Story