బంగాళాదుంపలు మాయమైతే మీరేం చేస్తారు..? ఓ మందుబాబు మాత్రం..

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో దీపావళి రోజున పోలీసులకు అత్యవసర కాల్‌ వచ్చింది

By Medi Samrat  Published on  1 Nov 2024 8:04 PM IST
బంగాళాదుంపలు మాయమైతే మీరేం చేస్తారు..? ఓ మందుబాబు మాత్రం..

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో దీపావళి రోజున పోలీసులకు అత్యవసర కాల్‌ వచ్చింది. దొంగతనం జరిగిందంటూ బాధితుడు వాపోవడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఒక్కసారిగా షాక్ అయింది. విజయ్ వర్మ అనే వ్యక్తి దొంగతనం జరిగిందని చెప్పాడు. అయితే ఏమిటా దొంగతనం అని పోలీసులు అడగ్గా.. మా ఇంటి నుండి 250 గ్రాముల పొట్టు తీసిన బంగాళాదుంపలు మాయమైనట్లు తెలిసింది.

పోలీసులు అతనిని ప్రశ్నించగా.. బంగాళదుంపల విషయంలో దర్యాప్తు చేయాలని విజయ్ పట్టుబట్టాడు. మద్యాన్ని ఆస్వాదించిన తర్వాత బంగాళాదుంపలను వండాలని అనుకున్నానని, అయితే ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అవి కనిపించలేదని వాపోయాడు. అతడు చేసిన వ్యాఖ్యలను పోలీసుల రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మద్యం తాగడంలో ఏ మాత్రం తప్పులేదని కూడా విజయ్ చెప్పాడు. మేము కష్టపడి పని చేసి సాయంత్రం మద్యం తాగుతాము, కాని సమస్య మద్యం గురించి కాదు.. ఇది బంగాళాదుంపల గురించి. వాటిని కనుగొనండని వర్మ తన మద్యపాన అలవాట్లను సమర్థించుకున్నాడు.

Next Story