Video : డాగేష్ భాయ్.. అదో కంత్రీ కుక్క‌..!

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వీధికుక్క ఓ ఘనకార్యం చేసి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేయ‌డంతో పాటు నవ్వులు పూయించింది.

By -  Medi Samrat
Published on : 23 Nov 2025 7:50 AM IST

Video : డాగేష్ భాయ్.. అదో కంత్రీ కుక్క‌..!

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వీధికుక్క ఓ ఘనకార్యం చేసి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేయ‌డంతో పాటు నవ్వులు పూయించింది. కుక్క లక్ష్యం ఒక చిన్న ఎలుక.. దానిని పట్టుకునే ప్రయత్నంలో అది కారు ముందు బంపర్ మొత్తాన్ని పీకేసింది. ఆ కుక్క దృష్టి, అభిరుచిని అందరూ ప్రశంసిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక కుక్క‌ తన పళ్ళతో ముందు బంపర్‌ను పదేపదే పట్టుకుని బలవంతంగా లాగుతుంది. అలా లాగుతుండ‌గా కొంత భాగం బంపర్ ఊడిపోతుంది. బంపర్ ఊడిన‌ వెంటనే కుక్క‌ వెంటనే ఎలుకను బయటకు తీయ‌డానికి ఎలుకను ప్రయత్నిస్తుంది. అయితే ఎలుక మ‌రింత లోప‌ల ఉండ‌టంతో కుక్క కోపంతో మొత్తం బంపర్‌ను లాగేస్తుంది. ఆ త‌ర్వాత ఎలుక‌ను అందుకొని వెళ్లిపోతుంది.

నార్త్ గోవాలో డాగేష్‌కి, కారుకు మధ్య గొడవ జరిగిందని, డాగేష్ భాయ్ బంపర్‌ను పీకిప‌డేశాడ‌ని వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి క్యాప్షన్‌లో రాశాడు. ఈ వీడియోపై ఒక నెటిజ‌న్‌.. NCAP కాదు.. డాగేష్ క్యాప్ టెస్టింగ్ జరుగుతోందని ప్రతిస్పందించారు. కుక్క త‌న బలాన్ని ప‌రీక్షించుకోంటోంద‌ని మ‌రో నెటిజ‌న్‌ రాశారు. ఒక నెటిజ‌న్‌ ఆ రహస్య భారత్ NCAP ఏజెంట్ అని రాశారు.

వీడియోలో కనిపిస్తున్న కారు మారుతీ సుజుకి ఎక్స్‌ఎల్6 అని తెలుస్తోంది. ఇది ఆరు-సీట్ల MUV.. ఇది మారుతి నెక్సా షోరూమ్‌ల ద్వారా విక్రయించబడుతుంది. ఇందులో SUV తరహా డిజైన్, కెప్టెన్ సీట్లు, 1.5L K15C స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.52 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ. 14.48 లక్షలు.

Next Story