ఆ కుక్క రైలు ప్రయాణం చేసి.. చివరికి గమ్యం చేరుకుంది..!

Dog train journey from Mumbai to Bhubaneswar. రైలులో పెంపుడు కుక్కలను తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతి ఉండడంతో... ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క రియోను ముంబై నుంచి

By అంజి  Published on  14 Oct 2021 3:41 PM GMT
ఆ కుక్క రైలు ప్రయాణం చేసి.. చివరికి గమ్యం చేరుకుంది..!

రైలులో పెంపుడు కుక్కలను తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతి ఉండడంతో... ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క రియోను ముంబై నుంచి భువనేశ్వర్‌ వరకు రైలులో తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సైతం ఆ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఆ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సాంగ్‌ను కూడా జత చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నిగా కామెంట్లు చేస్తున్నారు. రియో ఈజ్ సో క్యూట్, సూపర్‌ కూల్‌, హ్యాపీ జర్నీ, స్పీచ్‌లెస్‌ ఫీలింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

రైళ్లలో ఫస్ట్‌ క్లాస్ ఏసీలో మాత్రమే పెంపుడు కుక్కలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్‌ క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌ మొత్తాన్ని కుక్క యాజమాని బుక్‌ చేసుకోవాలి. ఏసీ చైర్‌ కార్‌ కోచ్‌లు, స్లీపర్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లలో పెంపుడు కుక్కలను తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. ఇక చిన్న కుక్క పిల్లలు కోసం కొన్ని కంపార్ట్‌మెంట్‌లో బాక్సులు ఉంటాయి. తమ పెంపుడు కుక్కలకు ఆహారాన్ని మాత్రం వాటి యాజమానులే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం ఏకంగా విమానంలోని బిజినెస్‌ క్లాస్‌ మొత్తం బుక్‌ చేసుకున్న విషయం తెలిసిందే.


Next Story