కుక్క-కోతి కలిసి దొంగతనం ప్ర‌య‌త్నం.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..

Dog Helps Monkey Steal A Packet Of Chips From Shop. కుక్క-కోతి కలిసి దొంగతనం చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By Medi Samrat  Published on  20 May 2022 6:30 PM IST
కుక్క-కోతి కలిసి దొంగతనం ప్ర‌య‌త్నం.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..

కుక్క-కోతి కలిసి దొంగతనం చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుక్క - కోతి మధ్య స్నేహానికి సంబంధించిన వీడియో ఖచ్చితంగా మీకు నవ్వును తెప్పిస్తుంది. ఈ రెండూ కలిసి దొంగతనం చేశాయి. రెండు జీవాలు ఒకదానికి ఒక‌టి సహాయం చేసుకుంటూ చిప్స్ ప్యాక్‌ను దొంగిలించడం చూడవచ్చు. వీడియో పాతదైనా కానీ ఇప్పుడు వైరల్ గా మారింది. గత ఏడాది డిసెంబర్‌లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో మళ్లీ వైరల్ అవుతోంది.

కుక్క ఒక దుకాణం ముందు నిలబడి ఉండగా.. కోతి దాన్ని ఆసరాగా తీసుకుని చిప్స్ ప్యాకెట్ ను దొంగతనం చేయడానికి తెగ ప్రయత్నించింది. "కోతి- కుక్క మంచి స్నేహితులు కాదని ఎవరు అంటారు." అంటూ వీడియోను పలువురు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2,500 లైక్‌లు, 29,000 పైగా వ్యూస్ వచ్చాయి. కోతులు, కుక్కలు స్నేహంగా ఉండవని చాలా కాలం నుంచి చెబుతున్నప్పటికీ, సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అవి తప్పని నిరూపించాయి.









Next Story