కూతురు చేసిన ప‌నికి ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు..!

Daughter surprises parents with life-size portrait. Watch how mom and dad react. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కూతురు తన తల్లిదండ్రులను ఆశ్చర్యపరుస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది

By Medi Samrat  Published on  25 Feb 2023 10:09 AM GMT
కూతురు చేసిన ప‌నికి ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు..!

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కూతురు తన తల్లిదండ్రులను ఆశ్చర్యపరుస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆమె తన తల్లి, తండ్రికి చెప్పకుండా వారి లైఫ్-సైజ్ పోర్ట్రెయిట్‌ను ఏర్పాటు చేసినట్లు చూపిస్తుంది. తల్లిదండ్రుల రియాక్షన్ ను కూడా వీడియోలో క్యాప్చర్ చేశారు. వీడియో సృష్టికర్త శ్రీలక్ష్మి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. “నాకు దేవుడు నా తల్లిదండ్రుల రూపంలో మాత్రమే ఉన్నాడు. నా తల్లిదండ్రులకు ఇలాంటి పోర్ట్రెయిట్‌ను బహుమతిగా ఇవ్వాలనే ఆలోచనతో నాకు సహాయం చేసిన @papervaporsకి మిలియన్ ధన్యవాదాలు. ఇది నేను ఊహించిదానికంటే గొప్పగా ఉంది ”అని ఆమె వీడియోను పోస్ట్ చేస్తూ రాసింది.

ఈ వీడియోలో ఆమె ఓ ప్యాకేజీని తెరవడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. ఒకానొక సమయంలో, ప్యాకేజీని తెరవడం కొనసాగించడానికి ఆమె తన తండ్రి సహాయాన్ని కూడా తీసుకుంది. పోర్ట్రెయిట్‌ని చూసిన ఆమె తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొన్ని రోజుల క్రితం వీడియో పోస్ట్ చేశారు. క్లిప్ కు 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ సంఖ్య మరింత వేగంగా పెరుగుతోంది. లైక్స్ కూడా లక్షల్లో వస్తూ ఉన్నాయి.


Next Story