ఎంత హాస్ట‌ల్ నుంచి వ‌స్తుంటే మాత్రం.. ఇదేం కోరిక‌..!

Daughter special request to father as she returns home.సాధార‌ణంగా హాస్ట‌ల్‌లో ఉండే పిల్ల‌లు ఎప్పుడెప్పుడు ఇంటికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2022 2:38 AM GMT
ఎంత హాస్ట‌ల్ నుంచి వ‌స్తుంటే మాత్రం.. ఇదేం కోరిక‌..!

సాధార‌ణంగా హాస్ట‌ల్‌లో ఉండే పిల్ల‌లు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అని ఆలోచిస్తుంటారు. సెల‌వులు రావ‌డం ఆల‌స్యం క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా ఇంటి బాట ప‌డుతారు. కొంద‌రు అయితే.. ఇంటికి వెళ్లాక త‌మకు ఇష్ట‌మైన ఆహార ప‌దార్థాల‌ను అమ్మ‌తో వండించుకుని తింటారు. మ‌రీ భోజ‌న ప్రియులైతే.. తాము ఫ‌లానా రోజున వ‌స్తున్నామ‌ని చెబుతా త‌మ‌కు ఏం కావాల‌న్న లిస్ట్‌ను ముందుగానే త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి చెబుతారు.

ఇలాగే ఓ అమ్మాయి త‌న‌కు ఏం కావాల‌న్న లిస్ట్‌ను త‌న తండ్రికి పంపించింది. మొద‌ట ఆ లిస్టు చూసి ఆశ్చ‌ర్య పోయిన తండ్రి త‌రువాత న‌వ్వుకుని కూతురు పంపిన లిస్ట్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే అది వైర‌ల్‌గా మారింది.

శ్వేతాంక్ అనే ట్విట్ట‌ర్ యూజ‌ర్ కుమార్తె హాస్ట‌ల్‌లో ఉండి చ‌దువుకుంటోంది. 5 నెల‌ల త‌రువాత ఆమె ఈ నెల 16న ఇంటికి రాబోతుంది. ఈ నేప‌థ్యంలో తండ్రికి వాట్సాప్ మెసేజ్ చేసింది. తాను ఇంటికి వ‌చ్చే స‌రికి ఏయే వంట‌కాలు రెడి చెయ్యాలో ఓ లిస్ట్‌ను పంపించింది. అందులో చికెన్ క‌బాబ్ నుంచి మ‌ట‌న్ బిర్యానీ, ఫిష్‌, టిక్కా ఇలా చేంతాండంత జాబితా ఉంది. అది చూసి ఆశ్చ‌ర్యానికి గురైన శ్వేతాంక్ త‌రువాత స‌ర‌దాగా ఆ జాబితాను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

ఇది వైర‌ల్‌గా మార‌డంతో నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. మా అమ్మాయి కూడా అంతే ఇలాగే లిస్ట్ పెట్టేది. ఇప్పుడు ఆమెకు 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఇప్పుడికి ఆ అలవాటు పోలేదు. పైగా ఇప్పుడు పంపే లిస్ట్‌లో భ‌ర్త‌, కొడుకు కు కావాల్సిన లిస్ట్ కూడా పంపుతుంది. ఓ యూజ‌ర్ అని కామెంట్ పెట్టింది.

Next Story