ఇదెక్కడి సెక్యూరిటీ సిస్టం రా బాబు..!

Cobra Sticking Out From Door Terrifies Internet. దొంగలు, ఎవరు పడితే వాళ్లు రాకుండా ఉండడానికి ఒక్కొక్కరు..

By Medi Samrat  Published on  27 Dec 2022 5:57 PM IST
ఇదెక్కడి సెక్యూరిటీ సిస్టం రా బాబు..!

దొంగలు, ఎవరు పడితే వాళ్లు రాకుండా ఉండడానికి ఒక్కొక్కరు.. ఒక్కో రకమైన సెక్యూరిటీ సిస్టమ్ ను వాడుతూ ఉంటారు. కొందరు కుక్కలు వంటివి పెంచుతూ ఉంటారు. అయితే ఏ డోర్ ద‌గ్గ‌రైనా నాగుపాము ఉండ‌టం చూశారా..? తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఇంటి తలుపు వెనుక నుండి ఒక నాగుపాము బయట వరకూ వచ్చింది. కొద్దిసేపటి తరువాత, అప్రమత్తంగా కనిపించిన పాము, దానిని చిత్రీకరిస్తున్న వ్యక్తిపై దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. "సురక్షితమైన భద్రతా వ్యవస్థ!" అనే శీర్షికతో సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉన్నారు. నెటిజన్లు ఈ వీడియోకు తమదైన రీతిలో కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఓ యూజర్ పోస్టు చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 30000కు పైగా వ్యూస్ వచ్చాయి.




Next Story