వరమాల వేయబోగా.. కబడ్డీ ఆడించిన వధువు.. వరుడి తిప్పలు.. వీడియో వైరల్
Bride Playing Kabaddi with groom on stage.పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఆ రోజు
By తోట వంశీ కుమార్ Published on 25 July 2021 12:49 PM ISTపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఆ రోజు జరిగే సంఘటనలను ఎంతో పదిలంగా తమ జ్ఞాపకాలలో దాచుకుంటారు. ఇటీవల కాలంలో యువత.. తమ వివాహాలలో ఏదో ప్రత్యేకంగా ఉండాలని బావిస్తున్నారు. ఇందుకోసం కొత్త కొత్త పద్దతులను ప్రయత్నిస్తున్నారు. కొన్ని సార్లు ఇవి బాగానే ఉన్నా.. చాలా సార్లు మాత్రం ఫన్నీగా ఉంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ వారు చేసే పనులు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. తాజాగా పెళ్లిలో చోటు చేసుకున్న ఓ ఫన్నీ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే..? వధూ వరులు ఇద్దరూ వేదికపై ఉన్నారు. ఒకరి మెడలో మరొకరు దండలు వేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఇంతలో ఓ ఇద్దరు మహిళలు వచ్చి.. వధువుకు అలకరణలో దిద్దుబాట్లు చేయడంతో పాటు ఆమె చెవిలో ఏదో చెప్పి వెళ్లారు. ముందుగా వధువు.. వరుడి మెడలో దండ వేసింది. అనంతరం వరుడు.. వధువు మెడలో దండ వేసేందుకు యత్నించగా.. వధువు వెనక్కి వంగింది. వరుడు ఒక్క అడుగు ముందుకు వేయగా.. ఆమె రెండు అడుగులు వెనక్కి వేసింది.
పక్కనే ఉన్న బల్ల చుట్టూ వరుడిని తిప్పించింది. అలా వరుడిని స్టేజీ మొత్తం వరుడిని తిప్పుతూ కబడ్డీ ఆట ఆడించింది అనుకోండి. చివరకు ఆ పెళ్లికొడుకు ఎలాగోలా వధువు మెడలో పూలమాల వేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. జాగ్రత్త బ్రదర్.. ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు ముందు చాలా ఆటలు ఆడాల్సి వస్తుందని ఒకరు కామెంట్ చేయగా.. వధువుకు గేమ్స్ అంటే ఇష్టం ఉన్నట్లుగా ఉంది అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓసారి వీడియో చూసేయండి.
यूं तो यह जयमाल का दृश्य है, पर दुल्हन की हरकत देखकर लगता है कि वो कबड्डी खेलने के इरादे से आई थी।
— Manish Mishra (@mmanishmishra) July 23, 2021
दूल्हे के दोस्तों का धन्यवाद जिन्होंने जयमाल सम्पन्न करवाने में मदद की। @navalkant @sengarlive @candidbhanot @PANKAJPARASHAR_ @nadeemNBT pic.twitter.com/cDzH0o8rQx