రూ.2100 నగదును లెక్కించలేకపోయిన వరుడు.. వధువు ఏం చేసిందంటే..?
Bride calls off wedding as groom fails to count money.పెళ్లి కొడుకు నిరక్ష్యరాసుడు అనే కారణంతో వధువు
By తోట వంశీ కుమార్ Published on 22 Jan 2023 10:28 AM ISTఇటీవల కాలంలో పెళ్లి పీటలపై పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న, చిన్న కారణాలకే వివాహాలను రద్దు చేసుకుంటున్నారు. వరుడుకి బట్టతల ఉందనో, మద్యం తాగి వచ్చాడనో, పొట్ట ఉందనే కారణాలతో ఆగిపోయిన ఘటనలు చూశాం. అయితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెళ్లి కొడుకు నిరక్ష్యరాసుడు అనే కారణంతో వధువు అతడిని చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో మరికాసేపట్లో జరగాల్సిన వివాహం రద్దైంది.
దుర్గుపూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి మైన్‌పురి పోలీస్ స్టేషన్ బిచ్మాలోని బబినాసారా గ్రామంలో నివసిస్తున్న ఓ యువకుడితో పెళ్లి చేయాలని మూడు నెలల క్రితం పెద్దలు నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ రాత్రికి పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించారు. పెళ్లి వేడక కోసం ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
20వ తేదీ సాయంత్రం పెళ్లి కుమారుడు, అతడి కుటుంబం ఊరేగింపుతో వచ్చాడు. వారి ఆచారం ప్రకారం ద్వారచర్ల వేడక ప్రారంభైంది. అయితే.. వరుడు నిరక్షరాస్యుడని పెళ్లి కుమారై సోదరికి తెలిసింది. దీంతో ఆ యువతి 2100 నగదును వరుడికి ఇచ్చి లెక్కించమని కోరింది. అయితే.. వరుడు ఆ నగదును లెక్కించలేకపోయాడు. ఈ విషయం వధువుకు తెలిసింది.
అంతే ఆగ్రహంతో ఊగిపోయింది. నిరక్షరాస్యుడైన అతడిని పెళ్లి చేసుకునేది లేదని చెప్పింది. ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. ఎట్టి పరిస్థితుల్లో నిరక్షరాస్యుడిని పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పెళ్లి కోసం చేసిన ఖర్చుపై మాట్లాడుకున్నారు. ఎవ్వరికి ఎవరు ఏమీ ఇచ్చేది లేదని పెళ్లిని రద్దు చేసుకుని ఇరు వర్గాలు వెళ్లిపోయాయి.