అస్సాంకు చెందిన ఒక వ్యక్తి బైక్ డ్రీమ్ బైక్ ను కొనాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే అతడు డౌన్ పేమెంట్ కు డబ్బులను రెడీ చేసుకున్నాడు. ఇది అందరూ చేసేదే కదా కొత్తగా ఏముందని మీరు అనుకుంటున్నారేమో.. అతడు మొత్తం 50,000 రూపాయలను నాణేలు చెల్లించి కొనుక్కుని వార్తల్లో నిలిచాడు. షోరూం సిబ్బంది నాణేలను లెక్కిస్తున్న వీడియో వైరల్‌గా మారింది
కరీంగంజ్ జిల్లాకు చెందిన సూరజన్ రాయ్ అనే వ్యాపారి, తనకు ఇష్టమైన బైక్‌ని కొనడానికి గత కొన్ని సంవత్సరాలుగా ₹ 50,000 నాణేల రూపంలో ఆదా చేశాడు. రాయ్ శనివారం సాయంత్రం బైక్ షోరూమ్‌కి వెళ్లి, నాణేల రూపంలో మొత్తం ₹ 50,000 చెల్లించి వాహనం కొనాలనుకుంటున్నట్లు ఉద్యోగులతో చెప్పాడు. కాయిన్స్ చూసి ఉద్యోగులు షాక్ అయినప్పటికీ.. అతడికి బైక్ ను డెలివరీ చేశారు. "అతను శనివారం సాయంత్రం మా షోరూమ్‌కి వచ్చాడు, అతని కోరిక మేరకు, మేము అతనికి Apache 160 4V బైక్‌ని చూపించాము, ఆ బైక్‌ని చూసిన తర్వాత, ఆ వ్యక్తి తన వద్ద ₹ 50,000 నాణేలు ఉన్నాయని, అతను బైక్‌ను ఫైనాన్స్‌లో కొనాలనుకుంటున్నానని చెప్పాడు. డౌన్ పేమెంట్‌గా మొత్తాన్ని జమ చేసి అతడు ఆ బైక్ ను తీసుకున్నాడు" అని షోరూమ్‌లోని సిబ్బంది బర్నాలీ పాల్ తెలిపారు.