భర్తకు విడాకులు ఇచ్చి కుక్కతో పెళ్లి.. దానికి ఎలా ప్రప్రోజ్ చేసిందంటే..?
After divorcing husband the woman married a dog.సాధారణంగా దంపతుల మధ్య గొడవలు సహజం. ఇద్దరూ కూర్చుని
By తోట వంశీ కుమార్ Published on 24 Nov 2021 8:12 AM ISTసాధారణంగా దంపతుల మధ్య గొడవలు సహజం. ఇద్దరూ కూర్చుని చర్చించుకుంటే దాదాపు అన్ని సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. అయితే.. కొన్ని సార్లు చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలి వానలా మారి విడాకుల వరుకు దారి తీస్తుంటాయి. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ విషయంలో ఇలాగే జరిగింది. ఆ దంపతుల మధ్య గొడవ విడాకుల వరకు దారి తీసింది. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తరువాత సదరు మహిళ ఓ కుక్కను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తాను హ్యాపీగా ఉన్నానని అంటోంది. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలకు ఆ మహిళ ఇంటర్వ్యూలు ఇవ్వగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాల్లోకి వెళిలే.. 47 సంవత్సరాల అమండా రోడ్జర్స్ లండన్‌లో నివసిస్తోంది. ఆమె భర్త నుంచి విడాకులు పొందింది. ఒంటరిగా జీవిస్తోంది. ఈ సమయంలో తన పెంపుడు కుక్క షీబాతో ప్రేమలో పడింది. 200 మంది అతిథుల సమక్షంలో షీబాను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తాను సంతోషంగా జీవితం గడుపుతన్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. షీబా.. తనను ఎంతో ప్రేమగా చూసుకుంటుందని.. దాని కళ్లలో నిజమైన ప్రేమ కనిపిస్తోందని చెప్పింది. షీబాకు రెండు నెలల వయస్సు ఉన్నప్పటి నుంచే ప్రేమలో పడ్డానని.. పెళ్లికి ముందు షీబాకు ప్రపోజ్ చేసినట్లు తెలిపింది. షీబా ముందు మోకాళ్లపై కూర్చొని తన ప్రేమను తెలియజేసానని.. అందుకు షీబా తన తోక ఊపి సమాధానం చెప్పిందని తెలిపింది. అమండా, షీబాల మధ్య ప్రేమ కొందరికి వింతగా అనిపించవచ్చు కానీ.. అమండా అవన్ని పట్టించుకోనని చెబుతోంది. మనుషుల కంటే షీబాతోనే చాలా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.