2013లో జాబ్‌కు అప్లై.. 2021లో రిప్లై.. పైగా కంపెనీ ఏం చెప్పిందంటే..!
A woman gets reply in 2021 for a job application
By అంజి Published on 19 Oct 2021 5:48 PM ISTసాధారణంగా మనం ఏదైనా ఉద్యోగానికి అప్లై చేస్తే.. ఆ కంపెనీ రిప్లై కోసం కొన్ని రోజుల పాటు చూస్తుంటాం. కొన్ని రోజుల తర్వాత కూడా కంపెనీ నుంచి రిప్లై రాకపోతే అంతే సంగతులు అనుకొని, మన పని మనం చేసుకుంటాం. అయితే ఇందుకు భిన్నంగా వ్యవహరించింది ఓ కంపెనీ. ఉద్యోగం కోసం అప్లై చేసుకున్న తర్వాత 8 సంవత్సరాలకు రిప్లై ఇచ్చింది. మీకు మేం ఉద్యోగం ఇవ్వలేమని తెలిపింది. జో బక్‌వెల్ అనే మహిళ 2013 సంవత్సరంలో ఉద్యోగం కోసం ఓ కంపెనీకి దరఖాస్తు పెట్టుకుంది. కంపెనీ నుంచి రిప్లై వస్తదేమోనని ఆశతో ఎదురుచూసింది. ఎంతకు రిప్లై రాలేదు. ఇంకేముంది తన పని తాను చేసుకుంటూ గడుపుతోంది. అయితే ఇప్పుడు సడెన్‌గా ఆ మహిళకు కంపెనీ రిప్లై ఇచ్చింది. మీకు ఎలాంటి ఉద్యోగము ఇవ్వలేమని చెప్పింది. దీంతో ఆ మహిళ ఆశ్చర్యపోయింది. కంపెనీ రిప్లైను ఆ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో నెటిజన్లు లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు.