ఇదీ మామూలు ఎలుక కాదు.. నెక్లెస్‌ను దొంగిలించింది.. ల‌వ‌ర్ కోస‌మేనా..!

A Rat Steals a Necklace From A Jewelry Shop in Kerala.ఓ ఎలుక ఆ నెక్లెస్‌ను ఎత్తుకెళ్లింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Feb 2023 3:30 AM GMT
ఇదీ మామూలు ఎలుక కాదు.. నెక్లెస్‌ను దొంగిలించింది.. ల‌వ‌ర్ కోస‌మేనా..!

బంగారం షాపుల్లో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు కొన్ని ఆభ‌ర‌ణాల‌ను డిస్‌ప్లేల‌లో ఉంచుతుంటారు. అయితే.. ఉన్న‌ట్లుండి ఉండి డిస్‌ప్లే ఉన్న ఉంచిన ఓ ఖ‌రీదైన నెక్లెస్ మాయ‌మైంది. చోరీ ఎలా జ‌రిగింది అన్న విష‌యం సిబ్బందికి అర్థం కాలేదు. షాపు ఓన‌ర్‌తో క‌లిసి సీసీ టీవీ పుటేజీని చెక్ చేస్తుండ‌గా.. అందులో కనిపించిన దృశ్యం చూసి అంద‌రూ షాక్ తిన్నారు. ఓ ఎలుక ఆ నెక్లెస్‌ను ఎత్తుకెళ్లింది. ఈ ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కాసర్ గడ్ లోని ఓ ప్ర‌ముఖ న‌గల షోరూమ్‌లో డిస్ ప్లేలో ఉంచిన ఓ నెక్లెస్ మాయ‌మైంది. దీంతో అక్క‌డ ప‌ని చేస్తున్న సిబ్బంది అంద‌రిలో కంగారు మొద‌లైంది. ఆ నెక్లెస్ కోసం షాపు మొత్తం వెతికారు. అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దొంగ‌త‌నం జ‌రిగింది నిర్థారించుకున్నారు. మ‌రీ పోలీసుల‌కు కంప్లైట్ ఇచ్చే ముందు దొంగ‌త‌నం ఎవ‌రూ చేశారు అని తెలుసుకునేందుకు షాపు య‌జ‌మాని సీసీ టీవీ పుటేజ్‌ను చెక్ చేస్తున్నాడు.

అందులో క‌నిపించిన దృశ్యం చూసి అత‌డితో పాటు అక్క‌డ ఉన్న వారంద‌రూ షాక్ తిన్నారు. మీ మ‌నుషులే బంగారాన్ని వేసుకుంటారా..? ఏం మేం వేసుకుని మంచి రెడీ కావొద్దా అనుకుందో ఏమో తెలీదు గానీ ఓ ఎలుక ఆ నెక్లెస్‌ను ఎత్తుకెళ్తున‌ట్లు ఆ వీడియోలో క‌నిపించింది.

అర్థ‌రాత్రి స‌మ‌యంలో షాపు సీలింగ్ ఓ ఎలుక వ‌చ్చింది. డిస్ ప్లేలో ఉంచిన నెక్లెస్‌ల వ‌ద్దెకు వెళ్లింది. దానికి ఏమీ అనిపిందో తెలీదు గానీ.. టైం వేస్ట్ చేయ‌కుండా వెంట‌నే నెక్లెస్‌ను నోట క‌రుచుకుని వ‌చ్చిన దారి గుండానే వెళ్లిపోయింది. దీంతో షాపు య‌జ‌మానికి ఏమీ చేయాలో పాలుపోవ‌డం లేదు.

ఈ వీడియో నెటింట వైర‌ల్ కావ‌డంతో నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. వాలెంటైన్స్ డే ద‌గ్గ‌రి వ‌స్తుంది గ‌దా.. ఆ ఎలుక త‌న ల‌వ‌ర్ కోసం ఆ నెక్లెస్‌ను తీసుకువెళ్లి ఉంటుంద‌ని ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు. సీసీ కెమెరా ఉండ‌బ‌ట్టి స‌రిపోయింది గానీ.. లేకుండా ఆ నెక్లెస్ ఎలా క‌నిపించ‌కుండా పోయిందో ఎవ్వ‌రూ క‌నిపెట్టే వారు కాద‌ని అంటున్నారు.

Next Story