నా పెన్సిల్ ఎత్తుకుపోయిండు.. కేసు పెట్టండి.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బుడ్డోడు.. వీడియో వైరల్.!
A boy complaint on his friend after pencil stolen. తన ఫ్రెండ్ పెన్సిల్‌ను దొంగతనం చేశాడని ఓ బాలుడు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన ఘటన కర్నూలు జిల్లా పెద కడుబూరులో చోటు చేసుకుంది.
By అంజి Published on
25 Nov 2021 11:23 AM GMT

తన ఫ్రెండ్ పెన్సిల్‌ను దొంగతనం చేశాడని ఓ బాలుడు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన ఘటన కర్నూలు జిల్లా పెద కడుబూరులో చోటు చేసుకుంది. హోంవర్క్ చేసుకునే సమయంలో ఫ్రెండ్ తన పెన్సిల్‌ను ఎత్తుకెళ్లాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్థి హన్మంత్ పెన్సిల్‌ను మరో బాలుడు దొంగతనం చేశాడు. విద్యార్థి హన్మంత్ ఈ సమస్యను పరిష్కరించకునేందుకు తన పెన్సిల్ దొంగతనం చేసిన ఫ్రెండ్‌ను తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ప్రతి రోజు పెన్సిల్‌ను చోరీ చేస్తున్నాడని, డబ్బులు కూడా తీసుకుపోతున్నాడని, రోజు ఇదే తన ఫ్రెండ్ పని అంటూ, అతడి కేసు పెట్టాలని హన్మంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే అక్కడే ఉన్న హన్మంత్ ఫ్రెండ్.. సార్ తాను పెన్సిల్ తిరిగి ఇచ్చానంటూ పోలీసులకు సంజాయిషీ ఇచ్చుకున్నాడు. హన్మంత్ మాత్రం ఎంతకు వినకుండా.. ఈ ఒక్కసారికి కేసు పెట్టాలని పోలీసులను కోరాడు. ఆ తర్వాత ఇద్దరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరు రాజీ కుదుర్చుకోవాలని చెప్పారు. దీంతో ఇద్దరు విద్యార్థులు షెక్ హ్యాండ్ ఇచ్చుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ ఘటనతో పోలీసులు నవ్వుకున్నారు.
Next Story