న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 19 Oct 2020 12:31 PM1.వైభవంగా సీఎం కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ప్రత్యూష నిశ్చితార్థం ఆదివారం విద్యానగర్‌లోని హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్‌రెడ్డితో ఆమె నిశ్చితార్థం జరిగింది. చరణ్‌రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. గతంలో సొంత తండ్రి, పినతల్లి చిత్ర హింసలకు గురి చేయడంతో తీవ్ర గాయాలైన ప్రత్యూష ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆమె ధీనస్థితిని చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పెద్ద మనసు చేసుకుని తానే స్వయంగా ప్రత్యూషను.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2.ఆ రైతుకు శాపంగా మారిన హత్రాస్ అత్యాచారం కేసు విచారణ
హత్రాస్ అత్యాచారం కేసు ఓ రైతుకు శాపంగా మారింది. దళిత యువతిపై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. అధికారులు, బాధితులు, నిందితులను ఇది వరకే పలు మార్లు విచారించారు. నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. అయితే బాధితులతో కలిసి పంట పొలంలోని క్రైం సీజన్‌ను పరిశీలించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3.ప్రతి ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం.. ఇల్లు కూలిపోయిన వారికి లక్ష: కేసీఆర్
భాగ్యనగరంలో వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. వరద ప్రభావానికి ఇప్పటికే చాలా కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. దాదాపు 33 మంది ప్రాణాలు కోల్పోగా, పలు వాహనాలు సైతం వరదల్లో కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయారు. వరద ప్రభావానికి నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4.తెలంగాణ: లడఖ్‌లో ఆర్మీ జవాను మృతి.. మృతదేహాన్ని పంపేందుకు అంగీకరించని అధికారులు
సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ఇటీవల ప్రాణాలు కోల్పోయిన జవాన్ షకీర్ హుస్సేన్ మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అధికారులు అంగీకరించడం లేదు. ఆయన భౌతికకాయానికి జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ తేలిందని, అందుకే మృతదేహాన్ని స్వగ్రామానికి పంపలేమని, శ్రీనగర్‌లోనే సైనిక లాంఛనాలతో షకీర్ హుస్సేన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5.ప్రముఖ బుల్లితెర నటి కన్నుమూత
ప్రముఖ బుల్లితెర నటి జరీనా రోషన్‌ఖాన్ (55) కన్నుమూశారు. జరీనాకు రోషన్ ఖాన్ గుండెపోటుతు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమె మరణంపై పలువరు బాలీవుడ్ సెలబ్రిటీలు, బుల్లితెర నటీనటులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జరీనా నటించిన కుంకుమ్ భాగ్య సహనటీనటులకు ఆమెకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ఆ సినిమాలో నటించిన పాత్రకు జరీనాకు మంచి పేరు వచ్చింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6.సూపర్ ఓవర్‌కు ముందు క్రిస్‌గేల్‌కు కోపమొచ్చింది
ఆదివారం రాత్రి ముంబైఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం ఇరు జట్లతో దాగుడు మూతలు ఆడింది. గెలుపొందేందుకు ఇరు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో పోరాడడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ నిర్వహించగా.. అక్కడా స్కోర్లు సమం అయ్యాయి. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు మరో సూపర్ ఓవర్‌ను నిర్వహించాల్సి వచ్చింది. ఆ సూపర్ ఓవర్‌లో క్రిస్‌గేల్, మయాంక్ అగర్వాల్ పంజాబ్ తరుపున బ్యాటింగ్‌కు దిగారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7.సింగర్‌పై అత్యాచారం.. ఎమ్మెల్యేపై కేసు నమోదు
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఓ సింగర్ పై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఓ ఎమ్మెల్యే. గాయని ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేతో సహా మరో ఇద్దరు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నిషద్ పార్టీ (నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్) ఎమ్మెల్యే విజయ్ మిశ్రా 2014లో తన ఇంట్లో ఓ కార్యక్రమం ఉందంటూ బాధిత సింగర్‌ను తన ఇంటికి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8.భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం
మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గడ్చిరోలిలో పోలీసులు-మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతం అయ్యారు. కోస్మి-కిస్నేలి అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని గడ్చిరోలి ఎస్పీ తెలిపారు. గత కొన్ని రోజులుగా మావోయిస్టుల కార్యకలాపాలు .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9.భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌కు పొంచివున్న ముప్పు
వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ఐతే… ఇంకా వర్ష సమస్య పోలేదని వాతావరణ అధికారులు తెలిపారు. తాజాగా… మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని తెలిపారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. అందువల్ల వచ్చే మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10.నేను ఓడిపోతే.. అమెరికాను విడిచి వెళ్లిపోతా : డోనాల్డ్ ట్రంప్
మరో రెండు వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు డోనాల్డ్ ట్రంప్. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడం తప్పదని దాదాపు అన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ సారి జో బైడెన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు అందుతున్న వేళ విస్కాన్సిస్‌లో జరిగిన ప్రచార సభలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే.. అమెరికాను విడిచి వెళ్లిపోతానని ట్రంప్ వ్యాఖ్యానించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి