ఆ రైతుకు శాపంగా మారిన హత్రాస్‌ అత్యాచారం కేసు విచారణ

By సుభాష్  Published on  19 Oct 2020 10:49 AM GMT
ఆ రైతుకు శాపంగా మారిన హత్రాస్‌ అత్యాచారం కేసు విచారణ

హత్రాస్‌ అత్యాచారం కేసు ఓ రైతుకు శాపంగా మారింది. దళిత యువతిపై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. అధికారులు, బాధితులు, నిందితులను ఇది వరకే పలు మార్లు విచారించారు. నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. అయితే బాధితులతో కలిసి పంట పొలంలోని క్రైం సీజన్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కారణంగా తన పంట నాశనం అవుతుందని క్రైమ్‌ సీన్‌ ఉన్న పంట పొలం యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కాగా, గత నెల 14న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు మానవ మృగాళ్లు ఆమె నాలుక కోసేసి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమె ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చగా, రెండు వారాల అనంతరం మరణించింది. అయితే అత్యాచారం జరిగిన ప్రాంతం బూల్‌గర్హీ గ్రామంలోని పంట పొలాన్ని సీబీఐ పోలీసులు పలుమార్లు పరిశీలించారు. ఈ క్రైమ్‌ సీన్‌ కారణంగా పొలం యజమానిని దూరంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఈ కారణంగా పంట పొలానికి నీళ్లు పెట్టకపోవడం, కలుపు తీయకపోవడంతో పంట నాశనం అయిపోయింది.

సదరు పంట పొలం యజమాని మాట్లాడుతూ.. కేసు విచారణలో భాగంగా క్రైమ్‌ సీన్‌లోని ఆధారాలు కాపాడేందుకు దాదాపు రెండున్నర ఎకరాల నా పొలానికి నీళ్లు పెట్టవద్దని, పొలంలో ఎలాంటి పనులు చేయవద్దని సీబీఐ అధికారులు ఆదేశించారని, దానికి తోడు చాలా మంట పంటను తొక్కడంతో దాదాపు 50వేల రూపాయల నష్టంతోపాటి ఇంటిల్లిపాది కష్టం వృధా అయిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం స్పందించిన తనకు నష్టపరిహారం ఇప్పించాలని రైతు అధికారులను వేడుకుంటున్నాడు.

అత్యాచారం ఇలా జరిగిందంటే..

హత్రస్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆ యువతి తన పొలంలో గడ్డి కోయడానికి వెళ్లింది. ఆ యువతితో ఆమె అమ్మ, సోదరి, సోదరుడు కూడా ఉన్నారు. అమ్మ, సోదరులకు దూరంగా ఆ యువతి పని చేస్తుండగా, వెనుక నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు ఆమెను పక్కనే ఉన్నచేనులోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆమె నాలుక కోసేశారు ఆ కామాంధులు. యువతి ఆర్ధనాదాలు విన్న ఆమె కుటుంబ సభ్యులు గమనించి వెళ్లే సరికి దుండగులు పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను వెంటనే హత్రాస్‌లోని జిల్లా కేంద్రంలో ఉన్నప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించారు. అక్కడ రెండు వారాలపాటు చికిత్స పొందిన ఆమె.. సెప్టెంబర్‌ 29న ప్రాణాలు విడిచింది. అదే రోజు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గాలించి అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.

Next Story