ఆ 10 పాఠశాలలపై కరోనా కొరఢా.. నోటీసులు జారీ చేసిన విద్యాశాఖ

By సుభాష్  Published on  16 March 2020 12:50 PM GMT
ఆ 10 పాఠశాలలపై కరోనా కొరఢా.. నోటీసులు జారీ చేసిన విద్యాశాఖ

విద్యా సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం కొరఢా ఝులిపించింది. కరోనా వైరస్‌ కారణంగా కేసీఆర్‌ సర్కార్‌ సోమవారం నుంచి విద్యాసంస్థలు సెలవు ప్రకటించింది. ఇక ప్రభుత్వం ఆదేశించినా సెలవులు ఇవ్వని స్కూళ్లపై విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. సెలవులు ఇవ్వని పాఠశాలలపై టాస్క్‌ ఫోర్స్‌ తనిఖీలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసిన సైదాబాద్‌ వీఐపీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, చార్మినార్‌, బహదూర్‌పూర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సహ పది పాఠశాలలకు విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది.

కాగా, తెలంగాణలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మార్చి 31వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విద్యాసంస్దలకు, సినిమాహాళ్లకు, షాపింగ్‌ మాల్స్‌ కు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశించినా సెలవులు ఇవ్వని పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది.

Next Story