ఒక్కసారిగా దీపాలు వెలిగించి వైరస్ ను అంతం చేయొచ్చా.. ఆయన చెప్పిన దాన్లో నిజముందా..?

By అంజి  Published on  6 April 2020 2:46 AM GMT
ఒక్కసారిగా దీపాలు వెలిగించి వైరస్ ను అంతం చేయొచ్చా.. ఆయన చెప్పిన దాన్లో నిజముందా..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు ఏప్రిల్ 5న భారతీయులంతా ఒక్కటై.. దీపాలు వెలిగించారు. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రజలంతా తమ సంఘీభావాన్ని వ్యక్త పరిచారు. ఆయన ఇలా చేయమని చెప్పడం వెనుక చాలా కారణాలే ఉన్నాయంటూ సోషల్ మీడియా లోనూ, మెసేజింగ్ యాప్ లలోనూ వీడియోలు, మెసేజీలు తెగ వైరల్ అయ్యాయి.

వైరల్ అవుతున్న వీడియోల్లో డాక్టర్ కె.కె.అగర్వాల్ వీడియో కూడా ఒకటి ఉంది. ఇండియన్ మెడికల్ అస్సోసియేషన్ మాజీ డైరెక్టర్ ఈయన. ప్రజలంతా కలిసి ఒక్కసారిగా దీపాలు వెలిగించడం కోవిద్-19 కు కారణమయ్యే ACE-2 రిసెప్టర్స్ ను అంతం చేయొచ్చని చెప్పారు. ఈ వీడియోలో ఆయన చెప్పింది నిజమా కాదా అన్నది తెలుసుకుందాం.

No, ‘collective consciousness’ on ACE-2 receptors won’t kill Coronavirus

నిజమెంత:

డాక్టర్ కె.కె.అగర్వాల్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. గత మూడు రోజులుగా ఈ వీడియోను చాలా మంది షేర్ చేశారు. నావల్ కరోనా వైరస్ దీపాలు వెలిగించడం ద్వారా వచ్చే వెలుగు ద్వారా అంతమవుతుందని ఆయన అన్నారు. ఈ పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్న వ్యక్తి... అంతేకాకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ కూడానూ..! ఈయన రెగ్యులర్ గా తన సోషల్ మీడియా ఖాతాలో పలు విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. 'కరోనా కి బాతే' అంటూ ఆయన ఫేస్ బుక్ లైవ్ ఇస్తూ అందరితోనూవు టచ్ లో ఉంటారు.

ఈయన చేసిన లైవ్ వీడియోకు సంబంధించిన వీడియో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ MyGovIndia ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేసి.. ఆ తర్వాత వెంటనే డిలీట్ చేసేశారు.

ఆ వీడియోలో డాక్టర్ గారు మాట్లాడుతూ అందరూ ఒక్కసారిగా దీపాలు వెలిగిస్తే వైరస్ దరి చేరదని చెప్పారు. మోదీ చెప్పినట్లు ఏప్రిల్ 5 రాత్రి 9 గంటల నుండి 9 నిమిషాల పాటూ దీపాలను వెలిగించడం ద్వారా వైరస్ అన్నది చనిపోతుందని 'యోగ వశిష్ట' చాప్టర్ 6లో అదే ఉందని అన్నారు. మన దేహంలో ACE-2 రెసెప్టర్లు ఉంటే ఇలా ఒక్కసారిగా వెలుగులు ప్రసరింపడం ద్వారా వాటిని అంతం చేయొచ్చని.. ఇది క్వాంటమ్ ప్రిన్సిపుల్ లేదా రితంభర సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఈ పని చేయమని మోదీ చెప్పారని తప్పకుండా పాటించాలని ఆయన చెప్పారు.

ఆయన చెప్పిందంతా 'పచ్చి అబద్దం'

డాక్టర్ చెప్పిన 'యోగ వసిష్ఠ సారం' అన్నది తత్వశాస్త్రం మీద రాసిన గ్రంథం.. దీన్ని వాల్మీకి మహర్షి రాశారు. యోగ వసిష్ఠ సారంలో ఉన్న చాప్టర్ 6 'మెడిటేషన్ ఆన్ ది సెల్ఫ్' అంటే ధ్యానం ద్వారా సాధించగలిగిన విషయాలను తెలియజేయడం. అందులో ఎక్కడ కూడా 'సామూహిక స్పృహ' ప్రస్తావన అన్నది లేదు.



అలాగే అందరూ కలిసి దీపాలు వెలిగించడం ద్వారా ACE-2 రిసెప్టెన్లను చంపవచ్చని ఆయన చెప్పింది కూడా 'పచ్చి అబద్దమే'.

సెంటర్ ఫర్ సెల్ల్యులర్ అండ్ మోలెక్యులర్ బయాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాకేష్ మిశ్రా మాట్లాడుతూ ఆయన చెప్పిందంతా 'నాన్ సెన్స్' అని స్పష్టం చేశారు. కోవిద్-19 ఒక వైరస్, అది మనిషి శరీరంలో ఎలా ఎంటర్ అవుతుందో శాస్త్రీయంగా చెప్పవచ్చు.. కానీ దీపాలను వెలిగింది వైరస్ కు కారణమయ్యే వాటిని ఆపగలం అని అన్నదానికి సైన్టిఫిక్ గా ఎటువంటి సాక్ష్యం కూడా లేదు అని ఆయన తేల్చారు.

మోదీ చెప్పినట్లు దీపాలు వెలిగించడంపై సోషల్ మీడియాలోనూ, మెసెంజర్ల లోనూ పెద్ద ఎత్తున మెసేజీలు వైరల్ అవుతున్నాయి. శాస్త్రవేత్తలు మాత్రం వీటిని అసలు నమ్మకూడదని చెబుతున్నారు.

Next Story