న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  7 July 2020 5:10 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

రూ.500 కోట్ల అంచనాతో తెలంగాణ సచివాలయ భవన నిర్మాణం.!

తెలంగాణ సచివాలయ భవనాన్ని కూల్చివేత ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం వారం రోజుల్లోపు కూల్చివేత పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఇదే స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణానికి ఇదే నెలలో పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. శ్రావణ శుద్ద పంచమి అంటే జూలై 25న లేదా ఆగస్ట్‌ 3న రాఖీ పౌర్ణమి నాడు నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఒక వ్యక్తితో 104 మందికి కరోనా

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 7 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ రోడ్‌లోని ఓ జ్యూవెలరీ స్టోర్‌ కరోనా హాట్‌ స్పాట్‌ కేంద్రంగా మారిపోయింది. ఆ స్టోర్‌లో పని చేసే ఓ వ్యక్తికి జూన్‌ 22న కరోనా వైరస్‌ సోకింది. దీంతో స్టోర్‌లో మొత్తం 303 మంది పని చేస్తుంటారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పీపీఈ సూట్లతో వచ్చి బంగారాన్ని ఎత్తుకుని వెళ్లిపోయారు..!

సతారా, మహారాష్ట్ర : దొంగతనాలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో చేస్తూ ఉంటారు. సినిమాల ప్రభావమో ఏమో కానీ కొందరు వాహనాలను తీసుకుని రావడం, ముఖాలకు మాస్కులు వేసుకుని మారణాయుధాలతో లోపలికి దూసుకుని వెళ్లడం.. బెదిరించి కావాల్సినవి లాక్కొనో, ఉన్నదంతా ఊడ్చుకునో వచ్చిన వాహనాల్లో చెక్కేస్తూ ఉంటారు. ఇవన్నీ అచ్చం సినిమా సీన్ల లాగే మనకు అనిపిస్తూ ఉంటాయి. అందుకే సినీ ఫక్కీలో దొంగతనాలు చేస్తున్నారు అని చెబుతూ ఉంటారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

30 లక్షల పేద కుటుంబాలకు జగన్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

ఆగస్టు 15వ తేదీన ఏపీలోని 30 లక్షల పేద కుటుంబాలకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పనుంది. రూ.20 వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల పేద కుటుంబాలకు ఇవ్వబోతున్నట్లు జగన్‌ ప్రకటించారు. ఆగస్టు 15న రాష్ట్రంలో 20శాతం మంది జనాభాకు అంటే 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని జగన్‌ తెలిపారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆన్‌లైన్ క్లాసులు ఎంచుకున్నందుకు అమెరికాను వీడాల్సిందే..!

విదేశాల నుండి వచ్చి అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరికైతే ఆన్ లైన్ క్లాసులు కేటాయించారో వారు అమెరికాను వీడాల్సిందేనంటూ సంచలన నిర్ణయం తీసుకుంది ట్రంప్ సర్కారు. యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఓ ప్రకటనను విడుదల చేస్తూ ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్నవారు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గ్రేటర్ హైదరాబాద్‌లో మాస్క్‌ లు ధరించని 5,500 మందికి జరిమానా

దేశంలో కరోనా వైరస్‌ కాలరాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పట్లో తగ్గేటట్లు లేదన్నట్లుగా కనిపిస్తోంది. ఇక తెలంగాణలో కూడా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏమాత్రం తగ్గడం లేదు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో మాత్రం కరోనా వైరస్‌ తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకంటే ఒక్క హైదరాబాద్‌లో తీవ్రస్థాయిలో ఉంది. ముందు తక్కువ స్థాయిలో ఉన్న కేసులు ఇటీవల నుంచి ఏకంగా 2వేలకు చేరువలో కేసులు నమోదు అవుతున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సరికొత్త చరిత్ర లిఖించిన ప్రవీణ్ తాంబే

జూన్ 6, 2020న క్రికెటర్ ప్రవీణ్ తాంబే సరికొత్త రికార్డును సృష్టించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడబోతున్న మొదటి భారతీయుడిగా చరిత్ర లిఖించాడు. రాజస్థాన్ రాయల్స్ మాజీ క్రికెటర్, స్పిన్నర్ అయిన ప్రవీణ్ తాంబేను సిపిఎల్ 2020 వేలంపాటలో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది. ప్రవీణ్ తాంబే ఐపీఎల్ లో ఎంట్రీ ద్వారానే సంచలనం సృష్టించాడనుకోండి. 41 సంవత్సరాల వయసులో ప్రవీణ్ తాంబే ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రూ. 5వేల రెమ్ డెసివిర్ ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారంటే?

మాయదారి రోగం రాకుండా మందు లేదు. కానీ.. దాని మహమ్మారి సోకిన వారు త్వరగా కోలుకునేందుకు వీలుగా హెటెరో కంపెనీయాంటీ వైరల్ డ్రగ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ మందు రూ.5వేలుగా అప్పట్లో చెప్పారు. కంపెనీ చెప్పిన దాని ప్రకారం.. మహమ్మారి సోకిన వారు ఒక్కొక్కరు ఏడు రెమ్ డెసివిర్ బాటిళ్లను వాడితే మహమ్మారి బారి నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం.. సంచలన విషయాలు వెలుగులోకి

విశాఖపట్నంలోని గోపాలపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థలో స్టెరీన్ గ్యాస్ లీక్ అయి 12 మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ఉదంతం చోటు చేసుకుని అప్పుడే రెండు నెలలు కావస్తోంది. కొన్ని రోజుల పాటు చర్చనీయాంశం అయిన ఈ విషాదాంతం గురించి తర్వాత అందరూ మరిచిపోయారు. ఐతే ఇప్పుడు మళ్లీ ఆ ఘటన వార్తల్లోకి వచ్చింది. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ.. తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో ఆగ‌ని క‌రోనా కేసులు.. కొత్త‌గా 1178 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా తీవ్రతరం దాల్చింది. ప్రతి రోజువందల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16,238 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 1178 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story