చిన్నారులకు పోర్న్ చూపించిన నిత్యానంద
By అంజి Published on 11 March 2020 8:21 AM ISTతన ఆశ్రమంలో ఉన్న బాలికలపై లైంగికదాడి పాల్పడం, బలవంతంగా నిర్బధించటం, కిడ్నాప్‌లకు పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత బోధకుడు స్వామి నిత్యానంద. చిన్నపిల్లలకు అశ్లీల చిత్రాలు చూపింస్తున్నాడంటూ తాజాగా అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
స్వయం ప్రకటిత భగవంతుడు స్వామి నిత్యానందపై ఓ కిడ్నాప్ కేసుని విచారణ చేస్తున్న అధికారులు అహ్మదాబాద్‌లోని స్వామి నిత్యానంద ఆశ్రమంలోని చిన్నపిల్లలకు కేసు విచారణ పేరుతో అశ్లీల చిత్రాలు చూపిస్తున్నారని ఆశ్రమంలోని స్వామి నిత్యానంద, అతని అనుచరులు, అధికారులపై కేసు నమోదు చేశారు. మొత్తం 14 మంది అధికారులలో పిల్లల సంక్షేమ కమిటీ సభ్యులు కూడా ఉండడం విశేషం.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తన ఆశ్రమంలో ఉన్న చిన్నారులకు బలవంతంగా నీలిచిత్రాలు చూపించారని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదవ్వగా.. తాజాగా పోక్సో చట్టం కింద మరో కేసు నమోదయినట్టు తెలిపారు. ఆ ఆశ్రమంలో ఉన్న గిరీశ్ తుర్లపతి నీలిచిత్రాల విషయాన్ని మొదట కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆయన దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన అహ్మదాబాద్ న్యాయస్థానం.. నిత్యానందపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వివేకానంద నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిత్యానందతో పాటు మరో 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానంద.. 2018లో దేశం విడిచి పారిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆచూకీ కోసం ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసులు సైతం జారీ చేసింది. కాగా, నిత్యానందను తమ ముందు హాజరు పర్చాలని ఇటీవల కర్నాటక హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేయగా.. ఆయన ఆధ్యాత్మిక పర్యటనలో ఉండటంతో న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేక పోయామని పోలీసులు వెల్లడించటం గమనార్హం.