నిర్భయ దోషులు రేపు సూర్యోదయాన్ని చూడకపోవచ్చు..
By అంజి Published on 19 March 2020 4:59 AM GMTఢిల్లీ: నిర్భయ కేసు దోషులకు విధించే ఉరి శిక్ష ట్రయల్స్ ను ఢిల్లీ తీహార్ జైలులో మీరట్‌కు చెందిన తలారీ పవన్ నిర్వ హించారు. నిర్భయ దోషుల ఉరికి ముందు వారి బరువును బట్టి ఇసుక బస్తాలతో తిహార్ జైలు గదిలో బుధవారం డమ్మీ ఉరి కార్యక్రమాన్ని జైలు అధికారులు చేపట్టారు. 2012 నాటి ఈ కేసులో దోషులు ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినరు శర్మలకు ఈ నెల 20న 5.30 గంటలకు ఉరి తీయనున్నారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సహా ఆరుగురు విద్యార్థులు మృతి
నిర్భయ అత్యాచారం జరిగినప్పుడు తాను ఢిల్లీలో లేనని, తన ఉరిశిక్ష నిలిపేయాలని ముఖేష్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు మంగళవారం తోసిపుచ్చడంతో..ఇప్పుడు ఉరిశిక్షకు రంగం సిద్ధమైంది. మరోవైపు తనకు విడాకులు మంజూరు చేయాలంటూ అక్షయ్ భార్య పునీత బీహార్‌లోని ఔరంగాబాద్ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 20న ఉరికి వేలాడనున్న నేపథ్యంలో తాను వితంతువుగా బ్రతకాలని కోరుకోవడం లేదని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.
Also Read: అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌రేప్.. నిందితుల్లో ముగ్గురు మైనర్లు
తన భర్త నిర్దోషి, ఆయన ఉరి తీసే ముందు చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని ఆమె పేర్కొన్నారు. అయితే తాము దాఖలు చేసుకున్న పలు పిటిషన్లు, అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరారు నిర్భయ దోషులు. తాము రెండో సారి క్షమాభిక్ష కోరే అవకాశాలు పరిశీలించాల్సి ఉన్నందున శిక్షను నిలిపి వేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై కూడా గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.