మెగా డాటర్ పెళ్లివేడుకకు ముహూర్తం ఖరారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2020 12:59 PM GMT
మెగా డాటర్ పెళ్లివేడుకకు ముహూర్తం ఖరారు

మెగాడాటర్‌ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ వివాహానికి ముహూర్తం కుదిరింది. డిసెంబర్‌ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు చైతన్య తండ్రి ప్రభాకర్‌ రావు తెలిపారు. తిరుమల స్వామివారి దర్శనం చేసుకుని, ఆయన పాదాల వద్ద వివాహ పత్రికను ఉంచి ఆశీర్వాదం తీసుకున్న ప్రభాకర్‌ రావు దంపతులు.. పెళ్లి ముహూర్తం గురించిన వివరాలను తెలిపారు.

అలాగే పెళ్లిని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి చేయబోతున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఇదే ప్యాలెస్ లో టాలీవుడ్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ వివాహంతోపాటు వెంక‌టేశ్ కూతురి పెళ్లి కూడా జ‌రిగింది. ఇదిలావుంటే.. నిహారిక నిశ్చితార్ధం ఆగస్టు 13వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోట‌ల్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. క‌రోనా నేఫ‌థ్యంలో ఈ వేడుకకు మెగా ఫ్యామిలి మినహా సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ హాజరు కాలేదు.

Next Story