న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్

By సుభాష్  Published on  18 Dec 2019 9:35 PM IST
న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్

1.నిర్భయ దోషులకు ఉరి శిక్ష వాయిదా..ఎందుకంటే

2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను ఢిల్లీ పాటియాల హౌస్‌ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా నిర్భయ అత్యాచారం, హత్యకేసులో దోషి అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ తనకు విధించిన ఉరి శిక్షపై రివ్యూపిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

2. మూడు రాజధానుల ఎఫెక్ట్ .. రేపు ఏపీ బంద్‌

ఏపీలో రాజధానుల రగడ అంతకంతకు పెరిగిపోతోంది. రాజధానిపై ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ప్రకటనపై ఆగ్రహంతో మండిపోతున్నారు. రోడ్లపైకి వచ్చిన రైతులు నిరసనలు తెలిపారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రైతులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

3. వైజాగ్‌లో టీమిండియా ఓపెన‌ర్ల వీరంగం.. స్కోరెంతంటే..?

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం వేదికగా విండీస్‌తో జరుగుతున్న రెండ‌వ‌ వన్డేలో టీమిండియా భారీస్కోరు దిశ‌గా ప‌య‌నిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్.. ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు శుభారంభం అందించారు. విండీస్ బౌలర్లను ఓ రేంజ్‌లో ఆడుకున్న రోహిత్, రాహుల్‌ల‌ జోడి పరుగుల వరదపారించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

4. బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం

2008 జైపూర్‌ వరుస పేలుళ్లపై న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ పేలుళ్లలో నలుగురిని దోషులుగా తేలుస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొకరిని నిర్ధోషిగా ప్రకటించింది. 2008, మే 13న జైపూర్‌లో ఇండియా ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థ వరుస బాంబుపేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో సుమారు 80 మందికిపైగా మృతి చెందగా, మరో 150 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

5. మంచు విష్ణు స్కూళ్ల‌లో జీఎస్టీ అధికారుల త‌నిఖీలు

హైద‌రాబాద్ కేంద్రంగా నేడు జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆధ్వ‌ర్యంలో అధికారులు ప‌లు పాఠ‌శాల‌లు, చిట్‌పండ్ కంపెనీలు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార‌స్తుల సంస్థ‌లు, కార్యాల‌యాల‌లో సోదాలు నిర్వ‌హించారు. ఈ రోజు ఉద‌యం నుండి మొద‌లైన ఈ సోదాలు ఇంకా కొన‌సాగుతున్నాయి. మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఖైరతాబాద్, బంజారా హిల్స్, బేగంపేట, లింగంపల్లిలోని 20 చోట్ల అధికారులు ఏక‌కాలంలో ఈ తనిఖీలు చేప‌ట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

6. నిజ నిర్ధారణ: ఎర్రచొక్కాలో ఢిల్లీ పోలీసులతో కలిసి విద్యార్ధులపై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తా?

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పై వ్యతిరేకతదేశ రాజధాని కి పాకింది. ఢిల్లీ లోని జామియా యూనివర్సిటి లో విద్యార్ధులపై ఢిల్లీ పోలీసులు చేసిన దాడి దేశంలో అలజడి సృష్టిస్తోంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోలు,చిత్రాలు సోషల్ మీడియా లో తిరుగుతున్నాయి.జామియా విద్యార్ధి ని పోలీసులు కొడుతుంటే, విద్యార్ధినులు అతని చుట్టూ చేరి అతనిని కాపాడే వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

7. జైలులో నిద్ర కూడా పట్టలేదు : బాలీవుడ్‌ నటి

గాంధీ-నెహ్రు కుటుంబాలను కించపరిచేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో బాలీవుడ్‌ నటి పాయల్‌ రోహత్గిని రాజస్తాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 2008 ఐటి చట్టం కింద ఆమెపై పలు కేసులు నమోదు చేశారు. ఆమె మంగళవారం సాయంత్రం బుండి సెంట్రల్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

8. రౌడీ బాయ్ కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్.. మ‌రో హిట్టు ప‌క్కానా..?

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ ఇమేజ్ ను మూట‌గ‌ట్టుకున్న యంగ్ సెన్సేష‌న్ విజయ్ దేవరకొండ.. ఆ త‌రువాత ఆ తర్వాత ‘మహానటి’, ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి సక్సెస్‌ ఫుల్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘డియర్ కామ్రేడ్’, ‘నోటా’ సినిమాల‌తో ఈ యేడాది కొద్దిగా డీలా ప‌డ్డా.. అవేమి ఈ హీరో మార్కెట్, ఇమేజ్ మీద ప్ర‌భావం చూప‌లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

9. బిగ్‌ బ్రేకింగ్‌: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రౌడీ షీట్‌ ..!

హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రౌడీ షీట్‌ కేసు నమోదు అయ్యింది. మంగల్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీట్‌ లిస్ట్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేరును పోలీసులు ఉంచారు. మంగళ్‌హాట్‌ పోలీసులు ఇవాళ రౌడీ షీట్‌ల కొత్త లిస్టును విడుదల చేశారు. తనపై రౌడీషీట్‌ నమోదు కావడంతో గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ పోలీసుల నిజస్వరూపమని రాజసింగ్‌ పేర్కొన్నారు. ప్రజా సేవ చేస్తున్న తనపై రౌడ్‌షీట్‌ కేసు నమోదు చేయడాన్ని రాజాసింగ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

10. రాజధానుల ఏర్పాటుపై తెలుగు తమ్ముళ్లలో భిన్న స్వరాలు

విశాఖపట్నం : ఏపీకి మూడు రాజధానులు అవసరమంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనపై టీడీపీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ ప్రకటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. “విశాఖపట్నం ని పరిపాలనా రాజధాని గా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి శాసనసభ లో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖ ను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

Next Story