న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్

By సుభాష్  Published on  10 Dec 2019 4:28 PM GMT
న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్

1. ‘అమెరికా’ అభ్యంత‌రాల‌పై ధీటుగా స‌మాధానం ఇచ్చిన ‘భార‌త్‌’

ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిషష్టాత్మకంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుపై యూఎస్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇంటర్‌నేషన్‌ రిలీజియన్‌ ఫ్రీడమ్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) త‌ప్పుబ‌ట్టిన విష‌యం తెలిసిందే. దీనిపై విమ‌ర్శ‌లు చేసిన యూఎస్‌సీఐఆర్ ఎఫ్‌పై భార‌త్ ధీటైన స‌మాధానం ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో యూఎస్ సీఐఆర్ఎఫ్ అభ్యంతరాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికా ప్యానెల్ చేసిన ప్రకటన సరైంది కాద‌ని భార‌త్ అభిప్రాయ‌ప‌డింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

2. ఏపీ రాష్ట్ర‌మో, దేశ‌మో చెప్ప‌లేని లోకేష్‌.. అమెరికా వెళ్లింది అందుకేనా..!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ఈ రోజు జ‌రిగిన స‌మావేశాలు వాడి వేడిగా కొన‌సాగాయి. స‌మావేశాల్లో వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధాలు కొన‌సాగాయి. టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ…చంద్ర‌బాబు ఆయ‌న నారా లోకేష్‌ను అమెరికాలో చ‌దివించాన‌ని గొప్ప‌లు చెప్పుకొంటున్నార‌ని, కానీ లోకేష్ కు జ‌యంతి, వ‌ర్థంతికి తేడా తెలియ‌ని స్థితిలో ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

3. అంఫైర్‌పై టీమిండియా ఓపెన‌ర్ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌.. మ్యాచ్ ఫీజులో కోత‌..!

టీమిండియా టెస్టు ఓపెనర్ మురళీ విజయ్‌కు అంపైర్లు జ‌రిమానా విధించారు. మైదానంలో అంఫైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయ‌డంతో పాటు దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఈ జరిమానా విధించారు. రంజీ సీజ‌న్ ప్రారంభ‌మ‌యిన నేఫ‌థ్యంలో తమిళనాడులోని దిండిగల్ వేదికగా కర్ణాటక, తమిళనాడు జట్ల మధ్య మ్యాచ్ మొద‌లైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

4. మెట్రోలో కొత్త సదుపాయం.. 3 నిమిషాల్లో సినిమా డౌన్‌లోడ్‌.!

హైదరాబాద్‌ మెట్రోలో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మెట్రో రైళ్లలో జీ5 మొబైల్ అప్లికేషన్‌ సేవలు ప్రారంభం అయ్యాయి. జీ5 సేవల ద్వారా మెట్రలో మొబైల్‌ డాటా వినియోగించకుండానే వీడియోలు, ఇంటర్నెట్‌ వాడుకోవచ్చు. మొదట పది మెట్రో స్టేషన్లలో మాత్రమే ఈ సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

5. ఆ జ‌ట్టంతా పించ్‌హిట్ట‌ర్లే.. అయినా మేం భ‌య‌ప‌డం..!

విండీస్‌ జట్టుపై ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా ఆ జ‌ట్టు కెప్టెన్‌ పొలార్డ్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. ఐపీఎల్ లో ముంబ‌యి జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించ‌డం వ‌ల‌న‌ పొలార్డ్‌ గురించి అన్ని విష‌యాలు క్షుణ్ణంగా తెలుసన్నాడు. అంతేకాదు.. 2019 ఐపీఎల్‌లో తాను ఓ మ్యాచ్‌కు అందుబాటులో లేని నేఫ‌థ్యంలో పొలార్డ్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడ‌ని.. ఆ టైంలో అతడి వ్యూహాలు... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

6. అసెంబ్లీలో ఉల్లి లొల్లి..!

రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉల్లి ధరల నియంత్రణపై టీడీపీ నేతలు చర్చకు తెరలేపారు. దళారులు ఉల్లి కృత్రిమ కొరతను సృష్టించి ధరలు అమాంతం పెరిగేలా చేశారని, ఇప్పుడు సామాన్యులు ఉల్లిని కొనకుండానే కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఏర్పడిందని టీడీపీ నేతలు యద్దేవా చేశారు. ఉల్లి ధరలు ఇంత దారుణంగా పెరుగుతున్నా ప్రభుత్వం కనీస జాగ్రత్త చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

7. అయ్యప్ప ‘హరివరాసనం’ పాట ఎలా పుట్టింది..?

శబరిమల…ఈ పేరు చెబితేనే భక్తి భావం ఉప్పొంగిపొర్లుతుంది. కార్మిక మాసం వచ్చిదంటే చాలు ఊరూరా… అయ్యప్ప దీక్షపరులతో, అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోతుంటుంది. అయ్య‌ప్పస్వామిని లక్షలాది మంది తమ ఇష్టమైన దైవంగా కొలుస్తారు. ఎంతో మంది దేవుళ్లు ఉన్నా.. అయ్యప్పస్వామికి ఓ ప్రత్యేకత ఉంది. అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేయడం. స్వామికి ప్రత్యేకమైన పాట ఏమిటంటే పవళింపు పాట. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

8. మందుబాబులకు మరో ట్విస్ట్‌.. లిక్కర్‌ కార్డు వచ్చేనా..?

అమరావతి: రాష్ట్రంలో మందుబాబులకు వైసీపీ ప్రభుత్వం ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తోంది. ఇప్పటికే దశలు వారిగా మద్యం నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నది. అయితే తాజాగా రాష్ట్రంలో మద్యం అమ్మకాల కోసం ప్రభుత్వం త్వరలో లిక్కర్‌ కార్డ్‌ను ప్రవేశపెడుతుందన్న వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మద్యం కొనాలనుకునే వారు ముందుగా రూ. 5 వేలతో కార్డును కొనుగోలు చేయాలని.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

9. ఆ కేసును నాంపల్లి కోర్టుకు బదిలీ చేయండి: అక్బరుద్దీన్‌ ఓవైసీ

నిర్మల్ జిల్లా కోర్టుకు ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ అజీంబీన్‌ యహియా హాజరయ్యారు. 2012, నిర్మల్‌ సభలో హిందూ దేవతలపై అక్బరుద్దీన్‌ విద్వేష పూరిత ప్రసంగం చేశారు. అక్బరుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇవాళ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్‌ తన అనారోగ్యం దృష్ట్యా కేసును నాంపల్లి కోర్టుకు బదిలీ చేయాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

10. పీఎస్‌ఎల్‌వీ సీ-48 రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం..!

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. దేశ సరిహద్దులో నిఘాను పెంచేందుకు రీశాట్‌-2,బీఆర్‌1 శాటిలైట్‌ను రేపు శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు ముమ్మరం చేశారు. సతీష్‌ ధవన్‌ స్పేస్‌లోని మొదట ప్రయోగ వేదిక నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ48 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

Next Story
Share it