న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  8 July 2020 4:38 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

తెలంగాణ హైకోర్టుకు కరోనా ఎఫెక్ట్‌.. రేపటి నుంచి మూసివేత

తెలంగాణలో కరోనా వైరస్‌కు అంతే లేకుండా పోతోంది. రోజురోజుకు కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. ప్రతిరోజు 1500లకుపైగా కేసులు నమోదు కావడంతో మరింత కలవరపెడుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు నమోదువుతన్న కేసుల్లో దాదాపు 90 శాతం వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనివి కావడం తో నగర ప్రజలను మరింత భయాందోళన కలిగిస్తోంది. ప్రజలనే కాకుండా పోలీసులు..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ఫీజుల డిమాండ్‌.. లబోదిబోమంటున్న తల్లిదండ్రులు

తెలుగు రాష్ట్రాలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక కరోనా కట్టడి కోసం ఇప్పటికే విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. విద్యాసంస్థలతో పాటు పరీక్షలన్నీ రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో కార్పొరేట్‌ పాఠశాలలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయని పేరెంట్స్‌ కమిటీ నాయకులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నామంటూ భారీగా ఫీజులను వసూలు చేస్తున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పుల్వామా సూసైడ్ బాంబర్ కు మొబైల్ ఫోన్ ఇచ్చిన వ్యక్తి దొరికాడు

శ్రీనగర్: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ.) పుల్వామా సూసైడ్ బాంబర్ కు మొబైల్ ఫోన్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో చోటుచేసుకున్న బాంబు దాడిలో నలభై మంది సీఆర్పీఎఫ్ జవానులు అసువులు బాసారు. ఈ ఘటన యావత్ భారతాన్ని కది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్.. కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటంటే..?

క్రికెట్ అభిమానులను సాధారణంగా సమ్మర్ లో మంచి మంచి మ్యాచ్ లను ఎంజాయ్ చేసే అవకాశం ఉండేది. కానీ కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలపాటూ ఎటువంటి క్రికెట్ మ్యాచ్ లు లేకుండా పోయాయి. ఎట్టకేలకు క్రికెట్ మ్యాచ్ లు మొదలు కాబోతున్నాయి. జులై 8న ఇంగ్లాండ్ తో వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. 117 రోజుల తర్వాత సౌతాంప్టన్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ మొదలుకాబోతోంది. ఇంగ్లాండ్ జట్టుకు బెన్ స్టోక్స్ నాయకత్వం వహిస్తూ ఉండగా, విండీస్ జట్టుకు జేసన్ హోల్డర్ నాయకత్వం వహిస్తూ ఉన్నాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Fact Check : భారత్‌కు మద్దతుగా నేపాల్ విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చారా..?

గత వారం వందల మంది నేపాలీ విద్యార్థులు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మొదలుపెట్టారు. కె.పి.శర్మ ఓలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాల్ లోని చాలా నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఓ వీడియోలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. నేపాల్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పించారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కేసీఆర్ ఆరోగ్యంపై హైకోర్టులో తీన్మార్ మల్లన్న పిటిషన్

గడిచిన కొద్ది రోజులుగా ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమైంది? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్యన సోషల్ మీడియాతో పాటు.. కొన్ని వెబ్ పత్రికల్లో కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా తేలిందని.. దీంతో ఆయన ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కరోనా వైరస్‌పై డబ్ల్యూహెచ్‌వో షాకింగ్‌ న్యూస్‌

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక కరోనా లక్షణాలు ఇప్పటి వరకు ఎన్నో వెల్లడించారు వైద్యనిపుణులు. రోజురోజుకు కరోనా గురించి కొత్త కొత్త విషయాలు బయటపడటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. కోవిడ్‌-19 గాలిలో ఉన్నట్లు నిర్ధారించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఢిల్లీకి దగ్గర్లో కనిపించిన ఆ రాక్షసుడు

వారం రోజుల కిందట ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్ పోలీసులను అతి కిరాతకంగా తన అనుచరులతో కలిసి చంపేసిన వికాస్ దూబేను పట్టుకోడానికి పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహిస్తూ ఉన్నారు. 25కు పైగా ప్రత్యేక బృందాలను వికాస్ దూబేను పట్టుకోవడం కోసం నియమించారు. ఇప్పటికే వికాస్ దూబే అనుచరులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు, వికాస్ దూబేను పట్టించిన వారికి లేదా సమాచారం ఇచ్చిన వారికి రెండున్నర లక్షల నగదు పురస్కారం కూడా ఇస్తామని తెలిపారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ కొత్త సచివాలయానికి స్ఫూర్తి ఆ మహా భవనమేనట

తనకు నచ్చనిది ఏదైనా సరే.. ఎంతవరకైనా వెళ్లి.. అనుకున్నది చేసే అలవాటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా సచివాలయాన్ని కూల్చేసి కొత్తది నిర్మించాలన్న విషయంలో తన పట్టును సాధించుకుంటున్న విషయం తెలిసిందే. వాస్తు బాగోలేదన్న కారణంగా ఉన్న సచివాలయాన్ని కూల్చేసి.. కొత్తది నిర్మిస్తున్న వైనంపై విరుచుకుపడుతుంటే.. అలాంటిదేమీ లేదని.. భవనం పాతది కావటం.. వసతులు సరిగా లేకపోవటం కారణంగానే కొత్త సచివాలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటం తెలిసిందే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీ: ఆ రెండు జిల్లాల్లో లాక్‌డౌన్‌ పొడిగింపు.. మరింత కఠినం

ఏపీలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో మరింత భయాందోళన నెలకొంది. ఇక విజయవాడ, కర్నూలు, గుంటూరు, రాజమండ్రి వంటి నగరాలతో పాటు మండలాలు, గ్రామాల్లో కూడా కరోనా వ్యాపిస్తోంది. ఇప్పటికే కరోనా అధికంగా ఉన్న ప్రకాశం, అనంతపురం, ఈస్ట్‌ గోదావరి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story