న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 30 Dec 2019 9:40 PM IST1.నా పిల్లలు అలా చేస్తున్నారని టీవీ పగలగొట్టాను..!
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఓ ఇంటర్వ్యూలో హిందూ సంప్రదాయాలపై స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. కొద్ది కాలం క్రితం అఫ్రిదీ ఓ మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో విలేఖరి మీరు ఎప్పుడైనా టీవీ పగలగొట్టారా..? అని అఫ్రీదిని ప్రశ్నించింది. బదులుగా అఫ్రిది పగలగొట్టాను అని సమాధానమిచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
2. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడిని హత్య చేసిన బాధితురాలి అన్న
నిర్భయ, దిశ ఘటనలు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇలాంటి హత్యలు, అత్యాచారాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా..కామాంధుల తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. బసవేశ్వర్ నగర్‌కు చెందిన పక్రుద్దీన్ నదాఫ్ 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన పక్రుద్దీన్ బాలికకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
3. ఎవరీ నిఖత్ జరీన్.. ఏంటా ధైర్యం..!
ఎవరీ నిఖత్ జరీన్.. గత రెండుమూడు రోజులగా మారుమోగిపోతుంది ఈ పేరు. పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో ఏ నోట విన్నా.. ఏ మాట విన్నా.. తన గురించే.. అసలు ఆమె ఎవరు.. ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్‌లోని మారుమూల ఓ ప్రాంతానికి చెందిన అమ్మాయి.. బాక్సింగ్ పై ఇష్టం పెంచుకొంది. అప్పటికే తన సత్తాను చాటి.. గెలుపు రుచిని ప్రపంచానికి చూపించిన మేరీకోమ్‌ను ఆదర్శంగా తీసుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
4. మెట్రో బంఫర్ ఆఫర్.. మందు బాబుల కోసమే..!
హైదరాబాద్: రేపు మెట్రో రైళ్ల పని వేళలను మెట్రో అధికారులు పొడిగించారు. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి. మద్యం సేవించినవారికి కూడా మెట్రో రైలులో అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని అధికారులు పేర్కొన్నారు. రేపు 2019 సంవత్సరానికి చివరి రోజు. బుధవారం 2020 జనవరి 1 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
5. నెటిజన్లకు ఎమోషన్‌గా సమాధానమిచ్చిన ‘రేణుదేశాయ్’
నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన రేణుదేశాయ్, ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతోకలిసి ఒంటరిగి జీవిస్తోంది. ఇక రేణుదేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు గాని, వారి అల్లరిచేష్టలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. రేణుదేశాయ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
6. చలికాలంలో ఉసిరికాయలు తినడం వల్ల ఉపయోగలేంటో తెలిస్తే..
చలికాలంలో ఉసిరికాయలు ఎక్కవగా లభిస్తుంటాయి. ఈ సీజన్ వచ్చిందంటే ఉసిరికాయలు తినడం ఎవ్వరు మర్చిపోరు. ఉసిరితో ఉన్న లాభాలను చూస్తే ప్రతి ఒక్కరు తినకుండా ఉండలేరు. ఈ సీజన్‌లో వచ్చే అనారోగ్య సమస్యలను ఉసిరికాయలు తరిమికొట్టేస్తోంది. ఈ సీజన్‌లో ఉసిరికాయలు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో వైద్యులు వివరిస్తున్నారు. ఉసిరికాయల్లో విటమిన్ సి ఉంటుంది. నారింజ, నిమ్మ, దానిమ్మకాయల కన్నాఎక్కవ విటమిన్ సి ఉసిరికాయల్లో లభిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
7. అలా నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన..!
ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే ఒకరు అలా అయితే తనను కలిసే ప్రయత్నం అస్సలు చేయొద్దంటూ సంచలన ప్రకటన చేశారు. అదేంటి..? ప‌్రజలు ఓట్లు వేయడం వలనే కదా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టింది. అటువంటిది ప్రజలు ఎన్నుకున్న నాయకుడి స్థానంలో ఉండి వారినే కలవొద్దని హుకుం జారీ చేస్తారా..? అంటూ ఈ కథనాన్ని చదువుతున్న మీరు సీరియస్ అవొచ్చు. కానీ, ఆ ఎమ్మెల్యే చెప్పిన మాటలకు మాత్రం ఆ నియోజకవర్గ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
8. ‘చెడ్డీ గ్యాంగ్’ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
చెడ్డీ గ్యాంగ్.. ఇతర రాష్ట్రాల్లో దడ పుట్టించిన ఈ దొంగల ముఠా మన రాష్ట్రాల్లో కూడా ప్రవేశించారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంది ఈ చెడ్డీగ్యాంగ్. గతంలో ఇతర రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతూ హడలెత్తించిన ఈ చెడ్డీ గ్యాంగ్. కొన్ని రోజుల కింద హైదరాబాద్‌లో కూడా ప్రవేశించారు. పలు ఇళ్లల్లో కూడా దొంగతనాలకు పాల్పడుతూ సీసీ కెమెరాలకు, పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
9. తండ్రి సీఎం.. తనయుడు మంత్రి.. కానీ
సుమారు నెలన్నర క్రితం వెలువడిన మహారాష్ర్ట ఎన్నికల ఫలితాల్లో బీజేపీ(105 సీట్లు) పరాజయం పాలయ్యింది. శివసేనకు ఎన్సీపీ మద్దతివ్వడంతో మొత్తం 110 సీట్లు అంటే బీజేపీ పై 5 సీట్ల తేడాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫలితాలొచ్చాక సీఎం సీటును శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ వ్యతిరేకించడంతో, ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవిని చేపడితే మద్దతిస్తామని ఎన్సీపీ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
10. మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్న మాలావత్ పూర్ణ
మాలావత్ పూర్ణ..అతిచిన్న వయసులోనే ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన బాలిక. 2014, మే 25వ తేదీన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే నాటికి మాలావత్ పూర్ణ వయసు 13 ఏళ్ల 11 నెలలు. 7 ఖండాల్లోని 7 ఎత్తయిన పర్వతాలను అధిరోహించడమే ఆమె జీవిత లక్ష్యం. ఇప్పటి వరకూ 6 ఎత్తయిన పర్వతాలను అధిరోహించిందీ మాలావత్ పూర్ణ. అంటార్కిటికీ ఖండంలోని విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…