'చెడ్డీ గ్యాంగ్‌'ను అరెస్ట్‌ చేసిన రాచకొండ పోలీసులు

By సుభాష్  Published on  30 Dec 2019 8:51 AM GMT
చెడ్డీ గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేసిన రాచకొండ పోలీసులు

ముఖ్యాంశాలు

  • వరుస చోరీలతో హడలెత్తిస్తున్న చెడ్డీ గ్యాంగ్‌

  • చెడ్డీ గ్యాంగ్‌ మూఠాను మహారాష్ట్రలో పట్టుకున్న రాచకొండ పోలీసులు

చెడ్డీ గ్యాంగ్‌.. ఇతర రాష్ట్రాల్లో దడ పుట్టించిన ఈ దొంగల ముఠా మన రాష్ట్రాల్లో కూడా ప్రవేశించారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలను టార్గెట్‌ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంది ఈ చెడ్డీగ్యాంగ్‌. గతంలో ఇతర రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతూ హడలెత్తించిన ఈ చెడ్డీ గ్యాంగ్‌. కొన్ని రోజుల కింద హైదరాబాద్‌లో కూడా ప్రవేశించారు. పలు ఇళ్లల్లో కూడా దొంగతనాలకు పాల్పడుతూ సీసీ కెమెరాలకు, పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ గ్యాంగ్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠాలో ఏడుగురిని రాచకొండ, ఎల్‌బీ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ చోరీ ముఠా మధ్యాహ్నం సమయంలో బొమ్మలు అమ్ముకుంటూ రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. చోరీలే కాదు అడ్డుగా వచ్చిన వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. వీరు కత్తులు, గొడ్డళ్లు, ఇతర మరణాయులతో పలు ప్రాంతాల్లో తిరుగుతూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు.

ఈ దొంగల మూఠాపై హిమాచల్‌ ప్రదేశ్‌, తెలంగాణ, ఏపీతోపాటు పలు ప్రాంతాల్లో దాదాపు 15 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ ఏడుగురు ముఠా సభ్యుల నుంచి రూ. 150 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి, రూ. 3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర అకోలాలో నివాసం ఉంటున్న వీరి ఆచూకీ రాచకొండ పోలీసులు కనుగొని వారిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజులుగా నగర పోలీసులకు నిద్రహారాలు లేకుండా చేస్తున్న ఈ ముఠాపై ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశారు. వీరి కోసం కొన్ని రోజుల నుంచి గాలింపు కూడా చేపడుతున్నారు. ఎట్టకేలకు ఈ ముఠాలో ఏడుగురిని అరెస్టు చేశారు.

Next Story
Share it