Telangana : హోరాహోరీగా సాగ‌నున్న‌ 'ఎమ్మెల్సీ' పోరు.. కార‌ణాలివే..!

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే గ్రాడ్యుయేట్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ కోసం నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Feb 2025 4:35 PM IST
Telangana : హోరాహోరీగా సాగ‌నున్న‌ ఎమ్మెల్సీ పోరు.. కార‌ణాలివే..!

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే గ్రాడ్యుయేట్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ కోసం నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చేసింది. నామినేషన్స్ 3వ తేదీ నుంచి 10వ తారీఖు వ‌ర‌కు జ‌ర‌గ‌గా.. పోలింగ్ 27న నిర్వ‌హించ‌నున్నారు. ఫ‌లితం మార్చి 3న వెలువ‌డ‌నుంది. అయితే.. ఈ సారి పోటీ హోరాహోరీగా జరిగే ఆస్కారం ఉంది.

ఇందుకు ప్రధాన కారణాలు చెప్పుకోవాలంటే..

1. కాంగ్రెస్ పైన రూరల్ ఏరియాల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ మధ్య బయటకు వచ్చిన కులగణన రిపోర్ట్, గ్రామ సభల‌లో వ‌చ్చిన‌ వ్యతిరేకత.. తప్పకుండా BRS/BJP కు అనుకూలంగా/కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో GOVT FORM చేసిన తర్వాత వచ్చే ఎటువంటి ఎలక్షన్స్(బైపోల్, లోకల్ body) ఐన రూలింగ్ పార్టీకే ఎక్కువ మొగ్గు ఉంటుంది కానీ ఈసారి ప్రత్యేకం.

2. కాంగ్రెస్ సోషల్ మీడియా(TWITTER) లో పెట్టిన పోల్ లో రిజ‌ల్ట్ కాంగ్రెస్‌కు చాలా వరకు వ్యతిరేకంగా వచ్చింది. ఈ result ను పూర్తిగా కొట్టిపారేసే అవకాశాలు లేవు (ఎందుకంటే ట్విట్టర్ అనే platform(సోషల్ మీడియా )లో చాలా మటుకు ఉండేది విద్యావంతులే. ఇపుడు జరగబోయే ఎలక్షన్స్ కూడా గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కి సంబందించినది.

ఇదే మంచి సందర్బంగా భావించిన కేసీఆర్ బయటకు వచ్చి తన పాత పంథాలో అధికార ప‌క్షంపై ఛాలెంజ్ విసురుతూ BRS శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. BRS ఓడిపోయిన నాటినుండి సోషల్ మీడియాను బలంగా చేసుకొని కాంగ్రెస్‌పైన వచ్చిన వ్యతిరేక‌తను గ్రామాల్లో యువతకు చేరవేస్తుంది.

3. మరోపక్క బీజేపీ కేంద్ర బడ్జెట్‌లో ప్రైవేట్ jobs/ఇన్కమ్ సోర్స్ 12L వరకు పన్ను మినహాయించింది. SC వర్గీకరణ చేసి SC(మాదిగ)ల ఓట్లు కూడా తమ వైపే తిప్పుకునేలా ప్లాన్ చేసింది. కాంగ్రెస్ పైన ప్రజల్లో వస్తున్న నెగెటివిటీని క్యాచ్ చేసుకోవాలని BRS శతవిధాలా తన సోషల్ మీడియా వింగ్ ద్వారా ప్రయత్నాలు చేస్తుంది.

ఈ పోటీ KNR-MEDAK-ADB-NZB టీచర్,గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కనపడుతుంది. దీనికి కారణం కాంగ్రెస్ గెలిచిన తర్వాత విద్యాశాఖలో ఎటువంటి చెప్పుకోదగ్గ మార్పు కనపడలేదు. ఒకవేళ ఈ MLC ఎలక్షన్స్ లో BRS/BJP విజయం సాధిస్తే రాబోయే రోజుల్లో వచ్చే లోకల్ బాడీస్ ఎలక్షన్స్(కాంగ్రెస్ గెలుపుకు కారణమైన రూరల్ ఓట్లు).. GHMC ఎలక్షన్స్ కాంగ్రెస్‌కు కత్తిమీద సాము.. అదే సమయంలో BRS/BJP కి CAKEWALK లాంటిది. పోనీ వేరే పార్టీల్లో గెలిచాక తమవైపు గెలిచినా వాళ్లను రూలింగ్ PARTY వైపు తిప్పుకుందాం అనుకున్నా కూడా, జనాలు తిరగపడే రోజులివి. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనుల ప్రారంభ సమయాల్లో వాళ్ళ ఆగ్రహాలకు గురవుతున్న లీడర్స్(పార్టీ మారిన) ను చూస్తున్నాం..

Credits : Ganga Shivashankar (M.Phrm)

Next Story