జిల్లాల పునర్వ్యవస్థీకరణ : సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న జ‌గ‌న్ స‌ర్కార్‌

Reorganisation of districts Right decision at a right time. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 26 జిల్లాలను ఏర్పాటు చేయడం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jan 2022 6:53 AM GMT
జిల్లాల పునర్వ్యవస్థీకరణ : సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న జ‌గ‌న్ స‌ర్కార్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 26 జిల్లాలను ఏర్పాటు చేయడం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయమని చెబుతున్నారు. ఎన్నికల వాగ్దానాన్ని ఇప్పుడు అమలు చేయడం ద్వారా జగన్ తన పరిపాలన విధానంలో మార్పులను తీసుకుని రావడానికి సమయం కేటాయించినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్, రిటర్న్ మెయిల్ ద్వారా ప్రస్తుత జిల్లాల కలెక్టర్ల నుండి అభిప్రాయాలను సేకరించిన తర్వాత, గత 48 గంటల్లో క్యాబినెట్ నోట్‌ను ఎలక్ట్రానిక్‌గా సర్క్యులేట్ చేసి, మంత్రుల నుండి ఆమోదం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక్కో జిల్లా ఉండాలనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా జిల్లాలను విభజించాలనే నిర్ణయం సరైన దిశలో సరైన అడుగుగా చెబుతున్నారు.

ప్రజల ఇంటి వద్దకే పాలన

చిన్న జిల్లాలు వాస్తవికంగా పరిపాలనను సామాన్యుల దగ్గరకు తీసుకెళ్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు కొత్త జిల్లాలను సృష్టించాయి. 10 జిల్లాలు ఉన్న తెలంగాణను మొత్తం 33 జిల్లాలుగా విభజించారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దుల ఆధారంగా జిల్లాలను విభజించాయి. "ప్రభుత్వం, మెరుగైన పరిపాలన, సంబంధిత ప్రాంతాల అభివృద్ధి కోసం.. AP జిల్లాల (ఫార్మేషన్) చట్టం, 1974లోని సెక్షన్ 3 (5) ప్రకారం కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం" అని చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ జారీ చేసిన నోటిఫికేషన్ అన్నారు.

అభిప్రాయాలను తెలియజేయడానికి 30 రోజుల సమయం

ప్రజలు, ప్రజా సంఘాలు, వివిధ విభాగాలకు చెందిన వారు పాల్గొని తమ అభ్యంతరాలు, విజ్ఞప్తులను సమర్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 రోజుల సమయం ఇచ్చింది. సమ్మిళిత పాలనను నిర్ధారించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం, మండలాల ప్రతిపాదిత భౌగోళిక పంపిణీని జాబితా చేస్తూ ప్రజల అభిప్రాయాన్ని కోరుతూ నోటిఫై చేసింది. ఆగస్టు 2020లో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తును ప్రారంభించిన ప్రభుత్వం.. 2021లో జనాభా లెక్కలు, భౌగోళిక సరిహద్దులను పునర్నిర్మించడంపై నిషేధం కారణంగా ఈ కసరత్తును వెనక్కి నెట్టవలసి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జనాభా గణనను ప్రారంభించలేకపోయారు. కేంద్రం జూలై వరకు నిషేధాన్ని సడలించడంతో, రాష్ట్రం చాలా ముందుగానే ప్రక్రియను పూర్తి చేసి, ఏప్రిల్ 2, 2022 నాటికి పరిపాలన ప్రారంభించాలనుకుంటోంది.

పరిష్కరించాల్సిన సమస్యలు :

25 లోక్‌సభ స్థానాలకు గాను 22 స్థానాలు గెలవడం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉపయోగపడింది. ప్రతిపాదిత జిల్లాల ఆకృతిని పునర్నిర్మించడం ద్వారా ప్రభుత్వం పలు సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చే ఉద్దేశ్యం వీగిపోతుందేమో చూడాలి. ఏది ఏమైనప్పటికీ, లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులకు అనుగుణంగానే, ప్రజామోదం ప్రభుత్వానికి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కనిపిస్తోంది. విభజన రాజకీయంగా జగన్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఎందుకంటే మరో ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా వైసీపీ చెప్పుకోవచ్చు.

కొత్త రాజకీయ ఉద్యోగాలు సృష్టించబడతాయి

ప్రభుత్వం, పరిపాలన, పార్టీలో కూడా చాలా పదవులు సృష్టించబడతాయి. కొత్త జిల్లా అంటే, కొత్త జిల్లా పరిషత్‌ల ద్వారా మరో 13 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు చైర్‌పర్సన్‌లుగా అవకాశం లభిస్తుంది. షెడ్యూల్డ్ తెగల కోసం రిజర్వ్ చేయబడిన అరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని కవర్ చేస్తూ రెండు రెవెన్యూ జిల్లాలను కలిగి ఉండాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టింది - మన్యం జిల్లా, అల్లూరి సీతారామ రాజు జిల్లాగా పేరు పెట్టారు. ఒకే సారి రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల సమాజంలోని అణగారిన వర్గాల మన్ననలు జగన్‌ పొందవచ్చు.

టీడీపీని ఇబ్బంది పెట్టే ఎన్టీఆర్ జిల్లా

విజయవాడను ప్రధాన కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయాలనే ఎత్తుగడ ఖచ్చితంగా టీడీపీకి రాజకీయ మాస్టర్ స్ట్రోక్..! అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా, అధికార కేంద్రంగా పల్నాడు జిల్లా నరసరావుపేట, పాలనా కేంద్రంగా బాలాజీ జిల్లా తిరుపతి, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఆయా ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను తీరుస్తున్నాయి. స్థానికతను ప్రేరేపించడం ద్వారా ప్రజల సెంటిమెంట్ ను సొంతం చేసుకుంటుంది. ఇది జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వ్యతిరేకించడం లేదా అడ్డంకిని కలిగించే ఆలోచన ఏదైనా రాజకీయంగా ప్రతిపక్షాలకు నష్టం కలిగించేదే. 'అనధికారికంగా' అయినా బీజేపీ ఈ చర్యను ఆమోదించాల్సి వచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగుల నిరసనల మధ్య

కొత్త వేతన సవరణ ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ప్రభుత్వ సిబ్బంది డిమాండ్ అత్యాశ తప్ప మరొకటి కాదనే అభిప్రాయాన్ని ప్రభుత్వం చాలా వరకు విజయవంతంగా ప్రజలలో సృష్టించింది. ఇది పక్కన పెడితే, ప్రభుత్వం కూడా తన సిబ్బంది చేస్తున్న ఆందోళనను టీడీపీ ప్రాయోజిత ఉద్యమంగా చిత్రీకరిస్తోంది. ఉద్యోగుల సంఘాలలో చీలిక తెచ్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు, మరికొందరు అధికారులు ఓవర్‌ టైమ్‌ పని చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. కొత్త జిల్లాలను రూపొందించే ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద పాత్ర ఉంటుంది, ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి తరువాతి దశ ఏదైనా ప్రజలలో వ్యతిరేకతను తీసుకుని వస్తుంది. ఉద్యోగులు, తమ యూనియన్‌లు రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రభుత్వంతో తలపడతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సిబ్బందిపై ఒత్తిడి పెంచవద్దని, ఇందులో తమ పాత్ర కీలకమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ చర్య ప్రజలను మిగతా విషయాల నుండి దృష్టిని మళ్లిస్తుంది. రాష్ట్రాన్ని పీడిస్తున్న వివాదాస్పద సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమయం దొరుకుతుంది. కాబట్టి కొత్త జిల్లాల నిర్ణయం పలు విధాలుగా ప్రభుత్వానికి ప్లస్ గా మారనుంది.

- A.Saye Sekhar



Next Story