సుశాంత్ కేసులో సరికొత్త ట్విస్ట్.. ఈ మందులు వేసుకోమని సోదరి చెప్పినట్లుగా వాట్సప్ మెసేజీలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sept 2020 4:42 PM IST
సుశాంత్ కేసులో సరికొత్త ట్విస్ట్.. ఈ మందులు వేసుకోమని సోదరి చెప్పినట్లుగా వాట్సప్ మెసేజీలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పలు సంస్థలు రియా చక్రవర్తి గురించి మాట్లాడుతూ ఉండగా.. సుశాంత్ కు సుశాంత్ సోదరికి జరిగిన వాట్సప్ చాట్ వైరల్ అవుతోంది. సుశాంత్ మానసిక సమస్యల గురించి అతడి కుటుంబానికి తెలుసుకునని తాజా చాట్ ద్వారా స్పష్టమవుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన సోదరి ప్రియాంకతో జూన్ 8న చాట్ చేసిన వాట్సప్ మెసేజీలు వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత 6 రోజులకు ముంబై లోని తన అపార్ట్మెంట్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

సుశాంత్ తో చాట్ చేసింది అతడి సోదరి ప్రియాంకగా భావిస్తూ ఉన్నారు. సుశాంత్ ను లిబ్రియమ్(Librium) ను వారం రోజుల పాటూ తీసుకోవాల్సిందిగా కోరింది. Nexito ను ప్రతి రోజూ తీసుకోమని కోరగా.. Lonazep ను ఎప్పుడైతే యాంగ్జైటీ అటాక్ వచ్చినప్పుడు వేసుకోమని కోరింది.

డిప్రెషన్, యాంగ్జైటీ సమస్యలకు ఈ మందులను వాడుతారు. సుశాంత్ కు మెంటల్ హెల్త్ సమస్యలు ఉన్నాయని తమకు తెలియదని ఓ వైపు సుశాంత్ కుటుంబం చెబుతూ ఉండగా.. తాజాగా బయటపడిన చాట్ కారణంగా ఆ కుటుంబం కొన్ని విషయాలను దాస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక సింగ్ తన సోదరుడికి కావాలంటే ముంబైలోని బెస్ట్ డాక్టర్ తో సంప్రదింపులు జరిపేలా చేస్తానని తెలిపింది. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతామని ఆమె చెప్పింది.

వైరల్ అవుతున్న వాట్సప్ చాట్ ఇదే

Priyanka Singh: First take Librium for a week then start nexito 10 mg once everyday after breakfast. Keep Lonazep handy whenever there is anxiety attack.

Sushant Rajput: ok sonudi

Sushant Rajput: No one will give without prescription

Priyanka Singh: Let me see if I manage

A missed voice call

Priyanka Singh: Babu call me... I have to send the prescription

Priyanka Singh: My friend here is a renowned doctor who can get you connected to the best doctor in Mumbai all confidential.. so don't worry

Priyanka Singh: Just call

Priyanka Singh: Sends an attachment (Prescription)

Priyanka Singh: Babu this is the prescription

Priyanka Singh: It's of Delhi but it should not matter . If anything, one can say it is on online consultation

Sushant Rajput: Ok thank you so much Sonadi.

లిబ్రియంను 'సెడేటివ్, హిప్నోటిక్ మెడికేషన్ లో బెంజోడయాజిపైన్ క్లాస్' లో భాగంగా ఇస్తారు. యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, ఆల్కాహాల్ లేదా డ్రగ్స్ ను తీసుకోవడం మానేసిన తర్వాత ఇస్తారు. నెక్సిటో 10ఎంజిని డిప్రెషన్, జెనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్స్ లో భాగంగా ఇస్తారు. లోనాజెప్ ను మూర్ఛ రాకుండా, పానిక్ డిజార్డర్స్ వంటివి దరి చేరకుండా వాడుతారు.

బీహార్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి ఫిర్యాదుతో చేసిన ఎఫ్.ఐ.ఆర్. రిపోర్టులో తన కుమారుడు మెంటల్ హెల్త్ సమస్యలతో బాధపడుతున్నాడని తనకు అసలు తెలియదని చెప్పారు. రియా చక్రవర్తి తన కుమార్తెకు మందులు ఇస్తున్నారని.. మా కుటుంబానికి తెలియకుండా రియా చక్రవర్తి ఇవన్నీ చేసిందని ఆరోపించారు. ఇప్పుడు బయటపడిన వాట్సప్ చాట్ ద్వారా సుశాంత్ మానసిక పరిస్థితి గురించి అతడి కుటుంబానికి తెలుసునని అర్థమవుతోంది.

రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ ను సంవత్సరం పైగా డేటింగ్ చేశానని తెలిపింది. రియా సుశాంత్ ఇంటి నుండి జూన్ 8న వెళ్ళిపోయింది. ఆరోజే సుశాంత్ తన సోదరి ప్రియాంక సింగ్ తో చాట్ చేసినట్లు తెలుస్తోంది.

Next Story