క్రికెట్‌లో కొత్త రూల్స్‌.. జూన్ నుండి ఇక ఆట మొద‌లైన‌ట్టే..!‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 May 2020 3:26 PM IST
క్రికెట్‌లో కొత్త రూల్స్‌.. జూన్ నుండి ఇక ఆట మొద‌లైన‌ట్టే..!‌

కరోనా వైరస్ విల‌య‌తాండ‌వం చేస్తుండ‌టంతో ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల‌లో లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అన్ని దేశాలు క‌ట్టుదిట్టంగా ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కారణంగా జ‌ర‌గాల్సిన క్రీడ‌లు కూడా అన్ని వాయిదా ప‌డ్డాయి. అయితే.. కొన్ని దేశాల‌లో లాక్‌డౌన్ ఎత్తివేస్తున్న క్ర‌మంలో.. ఐసీసీ క్రికెట్ నిబంధనల్ని కఠినతరం చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

ఇప్ప‌టికే చాలా టోర్నీలు ర‌ద్దుకాగా, మ‌రికొన్ని వాయిదా ప‌డ్డాయి. ఆ నేఫ‌థ్యంలో జూన్ నుంచి మళ్లీ క్రికెట్ సీజ‌న్‌ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో గ్రౌండ్ లో ఆట‌గాళ్ల‌తో పాటు.. అంపైర్లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, నడుచుకోవాల్సిన తీరు, నిర్వాహ‌కుల‌ నియమావళిపై ఐసీసీ ప్రత్యేకంగా కొన్ని రూల్స్‌ను రూ‌పొందించింది. ఈ క్రమంలో ఆట‌గాళ్లు, అంపైర్ల మధ్య ఉన్న చైన్ సైకిల్ రిలేషన్‌కు పూర్తిగా చెక్ పెట్టింది.

మాములు మ్యాచ్‌ల‌లో ఓవర్ ముగియ‌గానే.. బౌలింగ్ జ‌ట్టు బంతిని ఫీల్డ్ అంపైర్‌కి అందజేస్తుంది. వన్డేల్లో రెండు బంతుల్ని ఉప‌యోగించ‌డం వ‌ల‌న‌ ప్రతి ఓవ‌ర్‌కు ముందు... స్ట్రైకింగ్ అంపైర్ చేతి నుంచి బౌలర్ బంతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై కూడా అదే రూల్ కొన‌సాగుతుంది.. కానీ.. బంతిని అందుకునేముందు అంపైర్ తన చేతులకి గ్లౌవ్స్‌ని ధరించాలి. అలాగే.. బౌల‌ర్ ఓవ‌ర్ వేయ‌బోయే ముందు బౌల‌ర్.. అంపైర్‌కి తన క్యాప్, క‌ళ్ల‌ద్దాలు ఇవ్వడాన్ని కూడా ఐసీసీ నిషేధించింది.

అలాగే.. మైదానంలో ఆట‌గాళ్లు, అంపైర్లు కనీసం 1.5 మీటర్ల దూరం పాటించాల‌ని ఐసీసీ సూచించింది. ఇక ఇంకో ముఖ్య‌మైన విష‌య‌మేమిటంటే.. ఓ జట్టు సిరీస్‌ ఆడ‌టానికి ముందు 14 రోజుల పాటు.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటే.. అది కరోనా ఫ్రీ టీమ్ గా మారుతుంది. కావున‌ ఆటగాళ్ల మధ్య కోవిడ్-19 వ్యాప్తి ప్రమాదం ఉండ‌దు. అయితే.. జ‌ట్టులోని క్రికెటర్లతో అంపైర్లు ట్రావెల్ చేయ‌రు కాబట్టి.. ఎవ‌రికి ఏ ప్ర‌మాదం జ‌రగ‌కుండా ఐసీసీ ఈ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది.

Next Story