తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

By అంజి  Published on  23 March 2020 7:58 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే తెలంగాణలో ఏకంగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో శనివారం నాటికి 4 పాజిటివ్ కేసులుండగా ఆదివారం మరో రెండు కేసులు నమోదయ్యాయి. వీరిలో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. సోమవారం తెలంగాణలోని కరీంనగర్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరీంనగర్ లో మునిసిపల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇండోనేషియా బృందం సందర్శించిన ప్రాంతాలు, బసచేసిన నివాసం అన్నింటినీ శానిటేషన్ చేస్తోంది. 144సెక్షన్ అమలులో ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇప్పటివరకూ తెలంగాణలో 28 కేసులు నమోదవ్వగా, ఆంధ్రాలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Also Read: ప్రాణాంతకమైన వైరస్‌ల శక్తి ఎంతో తెలిస్తే షాకవుతారు

అటు ఏపీలో కూడా ఓ పోలీస్ అధికారి కుమారుడికి, విశాఖపట్నంలో ఇటీవలే మక్కా నుంచి వచ్చిన వ్యక్తి భార్యకు కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. ఆదివారం విజయవాడలో విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ ఉందని తేలడంతో..మూడ్రోజుల పాటు నగరమంతా జనతా కర్ఫ్యూ పాటించాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం కూడా ఈ నెలాఖరు వరకూ రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇవేమీ పట్టని ప్రజలు తెల్లవారంగానే రోడ్లపై దర్శనమిచ్చారు. షేర్ ఆటోలు యధావిధిగా తిరుగుతున్నాయి. చాలా వరకూ ఉద్యోగసంస్థలు ఉద్యోగులకు సెలవులివ్వకపోవడంతో తప్పనిసరిగా ఉద్యోగులు తమ విధులకు హాజరయ్యారు. ప్రజల ఆరోగ్యం కన్నా..స్వలాభాన్ని చూసుకుంటున్న ఉద్యోగ సంస్థలపై పలువురు మండిపడుతున్నారు.

Next Story