Fact Check : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చనిపోయారంటూ పోస్టులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 4:14 AM GMT
Fact Check : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చనిపోయారంటూ పోస్టులు..!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చనిపోయారంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఆయన చనిపోయారని చెబుతూ వస్తున్నారు.



సోషల్ మీడియా యూజర్లు ములాయం సింగ్ యాదవ్ ఫోటోను పోస్టు చేసి ఆయన మృతికి సంతాపం చెబుతూ ఉన్నారు. ” #RIP. SO CALLED NETAJI IN INDIAN POLITICS IS NO MORE. MAY HIS SOUL REST IN PEACE. @ MULAYAM SINGH YADAV. 👍 ” అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. భారతదేశ రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేత మరణించడం బాధాకరం అంటూ పలువురు ఈ పోస్టును షేర్ చేస్తూ వచ్చారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుద్రోవ పట్టించేలా ఉన్నాయి.

న్యూస్ మీటర్ ఈ కథనాలపై పలు వార్తా కథనాలను పరిశీలించింది. ‘ABP LIVE‘, ‘Times Now‘ మీడియా సంస్థలు ములాయం సింగ్ యాదవ్ చనిపోయారంటూ అక్టోబర్ 3, 2020న కథనాలను ప్రచురించాయి. ఉత్తర ప్రదేశ్ ఔరియా జిల్లాలోని సొంత గ్రామంలో రాత్రి 9 గంటల సమయంలో చనిపోయాయారని తెలిపారు.

చనిపోయిన వ్యక్తి పేరు ములాయం సింగ్ యాదవ్.. సమాజ్ వాదీ పార్టీ నేత అక్టోబర్ 3న మరణించారు. చనిపోయిన వ్యక్తి యూపీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కాదు.

ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ప్రజల మధ్య కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇద్దరి పేర్లు ఒకటే అయ్యాయి.. కానీ సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇంకొకరు.

అందిన రిపోర్టుల ప్రకారం మూడు సార్లు ఎం.ఎల్.సి. గా విజయం సాధించిన ములాయం సింగ్ యాదవ్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కాన్పూర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఇటీవలే ఆయన ఆసుపత్రి డిశ్చార్జ్ అయ్యారు.. కానీ అనారోగ్యం తిరగదోడింది. దీంతో ఆయన తుది శ్వాస విడిచారు.



సమాజ్ వాదీ పార్టీ కూడా ఆయన మరణంపై ట్విట్టర్ లో పోస్టు పెట్టింది. మాజీ ఎం.ఎల్.సీ. అయిన ములాయం సింగ్ యాదవ్ మరణం తమ పార్టీకి తీవ్ర లోటని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆయన ఫోటోను కూడా పోస్టు చేశారు.

సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ చనిపోయారన్నది నిజమే..! కానీ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ వస్తున్నారు. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

Claim Review:Fact Check : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చనిపోయారంటూ పోస్టులు..!
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story