Fact Check : భారత్‌కు మద్దతుగా నేపాల్ విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 July 2020 3:18 PM ISTగత వారం వందల మంది నేపాలీ విద్యార్థులు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మొదలుపెట్టారు. కె.పి.శర్మ ఓలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాల్ లోని చాలా నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఓ వీడియోలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. నేపాల్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. ఇలా నిరసనలు తెలియజేయడానికి ముఖ్య కారణం నేపాల్ ప్రైమ్ మినిస్టర్ భారత్ కు మద్దతుగా నిలవకుండా చైనాకు మద్దతుగా నిలిచాడని దాన్ని నేపాల్ ప్రజలు విద్యార్థులు అసలు సమ్మతించడం లేదని చెబుతూ వీడియోను వైరల్ చేశారు.
బెంగాలీలో వైరల్ అవుతున్న పోస్ట్ లలో కూడా భారత్-నేపాల్ దేశాల మధ్య ఉన్న స్నేహానికి ఇది ఒక ప్రతీక అని చెబుతూ వీడియోను వైరల్ చేస్తున్నారు.
চীনের হয়ে দালালি করার জন্য নেপালের বাসিন্দাদের বিদ্রোহ শুরু হয়েছে নেপালের প্রধানমন্ত্রীর বিরুদ্ধে. ধন্যবাদ বাদ জানাই নেপালের এই বাসিন্দাদের. ভারত ও নেপালের ভাই -ভাই এই সম্পর্ক অটুট থাকুক. 🇮🇳🇮🇳🇮🇳
నిజ నిర్ధారణ:
నేపాలీలు భారత్ కు మద్దతుగా నిలుస్తూ నిరసనలు చేశారు అన్నది పచ్చి అబద్ధం.
ఈ వీడియోకు సంబంధించిన ఒరిజినల్ వీడియోను వెతకగా ట్విట్టర్ లో పలువురు ఇందుకు సంబంధించిన పోస్టులు పెట్టారు. నేపాల్ లోని కెపి ఓలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. @NewsLineIFE కూడా నేపాల్ లో ఈ నిరసన కార్యక్రమాలు చోటుచేసుకున్నాయని అన్నారు.
@dhruvsharmaits1 ట్విట్టర్ ఖాతాలో పలు వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేశారు.
Huge protest against KP Oli in Nepal. @NewsLineIFE pic.twitter.com/HNnAe1V2M8
— Dhruv sharma (@dhruvsharmaits1) June 15, 2020
Kathmandu Post కథనం ప్రకారం జూన్ 11, 2020న 1000 మందికి పైగా ప్రజలు ఖాట్మండు లోని భట్భటేనిలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఈ నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ ప్రబలుతున్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. క్వారెంటైన్ సెంటర్లలో సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కోవిద్-19 కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలని, ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా తెలియజేయాలని కోరారు. పోఖారా, బిరత్నగర్, చిత్వాన్, హెతౌడా, బిర్గంజ్ ప్రాంతాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి.
నేపాలీ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలను ప్రచురించారు. ‘Enough is Enough’ అంటూ నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలువురు రోడ్ల మీదకు వచ్చారు. ఇకనైనా నేపాల్ ప్రభుత్వ తీరు మారాలని వారు కోరారు.
చైనాకు మద్దతుగా నిలుస్తున్న నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాలీలు భారత్ కు మద్దతుగా నిలుస్తూ రోడ్ల మీదకు వచ్చారు అన్నది పచ్చి అబద్ధం.