నెల్లూరులో విషాదం చోటు చేసుకుంది. ఓ డిగ్రీ విద్యార్థిని సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు భక్తవత్సల నగర్‌కు చెందిన రమ్య అనే విద్యార్థిని ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకునే ముందు ఫోటోలను తీసుకుని ముగ్గురు యువకులకు వాట్సాప్‌లో పంపింది. ఆ తరువాత వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ వీడియోను కుటుంబ సభ్యులు ఆలస్యంగా చూశారు. కాగా.. అప్పటికే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తలుపులు పగులకొట్టి చూసేసరికి విద్యార్థిని మృతి చెందింది. ముగ్గురు యువకుల వేదింపుల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని రమ్య కుటుంబ సభ్యులు బావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నగరంలోని ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ సెకండియర్‌ చదువుతోంది రమ్య.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.