హైదరాబాద్ : ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠాల గుట్టుని రట్టు చేశారు వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్‌ చేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తుండడంతో ఆక్సిజన్‌ సిలిండర్ల అమ్మకాలపై దృష్టిపెట్టిన వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాక్‌ మార్కెట్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు అమ్ముతున్న రెండు ముఠాలపై దాడులు చేశారు. వారి నుంచి 34 ఆక్సిజన్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొ సిలిండర్‌ను లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. వాటిని ఆరోగ్యశాఖకు అప్పగించారు. సిలిండర్ల అమ్మకాల పై దృష్టి సారించామని,
ఎవరైనా అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు అమ్మితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.