ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు
By సుభాష్ Published on 13 Jun 2020 11:38 AM ISTఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ఆమె పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో మరో ఆరు నెలలపాటు పొడిగించాలని సీఎం జగన్ మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన నీలం సాహ్ని నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి మహిళ సీఎస్‌గా వచ్చారు. ఎల్వీ సుబ్రమణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేయడంతో ఆయన స్థానంలో సాహ్ని బాధ్యతలు స్వీకరించారు.ఇప్పుడు ఆమె పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించింది కేంద్రం.
Also Read
అచ్చెన్నాయుడుకు రెండు వారాల రిమాండ్
Next Story